Telugu Global
National

ఏయే రాష్ట్రాల్లో రేపటి నుండి స్కూళ్లు తెరుస్తున్నారు?

ఈ నెల 21 నుండి…. తొమ్మిది నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకోసం స్కూళ్లు, కాలేజీలు పాక్షికంగా పనిచేయవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం రాష్ట్రప్రభుత్వాలకే వదిలేసింది. ఈ నేపథ్యంలో ఏయే రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాయో చూద్దాం… ఢిల్లీ ఇక్కడ అక్టోబరు ఐదు వరకు స్కూళ్లు మూసే ఉంటాయి. అయితే కంటైన్ మెంట్ జోన్లకు బయట ఉన్న ప్రాంతాల్లో నివసించే విద్యార్థులు 9 నుండి 12 వరకు […]

ఏయే రాష్ట్రాల్లో రేపటి నుండి స్కూళ్లు తెరుస్తున్నారు?
X

ఈ నెల 21 నుండి…. తొమ్మిది నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకోసం స్కూళ్లు, కాలేజీలు పాక్షికంగా పనిచేయవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం రాష్ట్రప్రభుత్వాలకే వదిలేసింది. ఈ నేపథ్యంలో ఏయే రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాయో చూద్దాం…

ఢిల్లీ

ఇక్కడ అక్టోబరు ఐదు వరకు స్కూళ్లు మూసే ఉంటాయి. అయితే కంటైన్ మెంట్ జోన్లకు బయట ఉన్న ప్రాంతాల్లో నివసించే విద్యార్థులు 9 నుండి 12 వరకు చదువుతున్నవారు… తమ స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి టీచర్లనుండి అవసరమైన మార్గదర్శకాలు పొందవచ్చని కేజ్రీవాల్ ప్రభుత్వం గతవారమే ప్రకటించింది.

బీహార్

9 నుండి 12 తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు… కంటైన్ మెంట్ ప్రాంతాల్లో ఉండనివారికి క్లాసులు ప్రారంభించవచ్చని ప్రభుత్వం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్

ఇక్కడ కూడా సెప్టెంబరు 21 నుండి పెద్ద తరగతుల (9-12)కు క్లాసులు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.

హర్యానా

ఈ రాష్ట్రంలో 10 నుండి 12వ తరగతి విద్యార్థులకు.. . అది కూడా కర్నల్, సోనీపట్ జిల్లాల్లో ప్రభుత్వ నిర్వహణలో ఉన్న విద్యాసంస్థలను మాత్రమే తెరుస్తున్నారు. పరిస్థితులు ఎలా ఉంటాయో చూసి తరువాత నిర్ణయం తీసుకుంటారు.

ఉత్తర ప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్, గుజరాత్…

ఉత్తర ప్రదేశ్లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగానే ఉండటంతో స్కూళ్లు ఇతర విద్యాసంస్థలు అన్నీ ఈ నెల చివరి వరకు మూసే ఉంచే అవకాశం ఉంది. కేరళ ముఖ్యమంత్రి కూడా ఈ నెల అంతా విద్యాసంస్థలన్నీ మూసి ఉంచాలనే నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఉత్తరాఖండ్, గుజరాత్ ప్రభుత్వాలు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి.

జమ్ము కాశ్మీర్

ఈ రాష్ట్రంలో సెప్టెంబరు ఇరవై ఒకటి నుండి స్కూళ్లు తెరవవచ్చనే నిర్ణయం తీసుకున్నారు. కానీ అది తప్పనిసరి కాదు. విద్యాసంస్థలు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం.

అసోం

కంటైన్ మెంట్ జోన్లకు బయట నివసించే 10, 11, 12 తరగతుల విద్యార్థులకు క్లాసులు నిర్వహించవచ్చనే నిర్ణయం తీసుకున్నారు.

ఇవి కాక దేశంలోని మిగిలిన రాష్ట్రాలు స్కూళ్ల ప్రారంభం గురించిన నిర్ణయం ఏదీ తీసుకోలేదు.

First Published:  20 Sep 2020 7:03 AM GMT
Next Story