ఎస్పీ బాలు… ఇంకాస్త బెటర్

కరోనా బారిన పడిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ కూడా వెల్లడించాడు. అయితే ఆయన ఇప్పటికీ వెంటిలేటర్ సహాయంతోనే గాలి పీల్చుకుంటున్నారు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ… ఆయన ఊపిరితిత్తులు కోలుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది. అందుకే ఆయనకు వెంటిలేటర్ సహాయంతోనే ఆక్సిజన్ అందిస్తున్నారు. అయితే ఇన్నాళ్లూ ఫ్లూయిడ్స్ పై ఉన్న బాలు.. 2 రోజులుగా నోటితో ఆహారం తీసుకుంటున్నారు.

మరోవైపు ఫిజియోథెరపీ కూడా జోరుగా సాగుతోంది. దీంతో ఆయన 3 రోజులుగా లేచి కూర్చుంటున్నారు. వైద్యుల సహాయంతో ఆయన ప్రతి రోజూ 20 నిమిషాల పాటు లేచి కూర్చుంటున్నారని వెల్లడించాడు చరణ్.