విలన్ గా మారిన తమన్న

నిజంగా ఎవ్వరూ ఊహించని పరిణామం ఇది. మిల్కీబ్యూటీ అలాంటి పాత్రకు ఓకే చెబుతుందని ఎవ్వరూ కలలో కూడా అనుకొని ఉండరు. కానీ తమన్న మాత్రం ప్రయోగాలకు సై అంటోంది. ఛాలెంజింగ్ రోల్స్ కావాలంటోంది. ఏరికోరి మరీ విలన్ పాత్రలో కనిపించేందుకు రెడీ అవుతోంది.

నితిన్ హీరోగా రాబోతున్న అంధాధూన్ రీమేక్ లో విలన్ గా కనిపించబోతోంది తమన్న. విలన్ అంటే ఇది ఆషామాషీ విలన్ కాదు. హిందీలో ఒరిజినల్ వెర్షన్ చూసినోళ్లకు తమన్న ఎంత సాహసం చేసిందో అర్థమౌతుంది. కాస్త బ్రీఫ్ గా చర్చించుకుందాం…

అంధాధూన్ సినిమాలో టబు విలన్ గా నటించింది. ప్రేమించే భర్త ఉంటాడు. కానీ ఓ పోలీస్ తో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. తమ అక్రమ సంబంధం తెలిసిపోయిందని తెలిసి కట్టుకున్న భర్తను చంపేస్తుంది. ఆ మేటర్ అంధుడైన హీరోకు తెలిసిపోయిందని తెలిసి అతడ్ని కూడా చంపడానికి రెడీ అవుతోంది.

ఇలా ఓవైపు విలనిజంతో పాటు మరోవైపు బోల్డ్ గా కూడా (అక్రమ సంబంధం సన్నివేశాల్లో) కనిపించే పాత్ర ఇది. ఇలాంటి పాత్రను టబు అద్భుతంగా పండించింది. మరి తమన్న, టబును మరిపిస్తుందా.. లెట్స్ వెయిట్ అండ్ సీ..