Telugu Global
National

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమరావతి భూకుంభకోణంలో ఇటీవల ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై స్టే ఇవ్వడంతో పాటు గ్యాగ్ ఆర్డర్‌ కూడా హైకోర్టు ఇచ్చింది. దర్యాప్తును ఆపడంతో పాటు ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలను మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ ప్రచురించడానికి వీల్లేదని అసాధారణ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. […]

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
X

హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమరావతి భూకుంభకోణంలో ఇటీవల ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై స్టే ఇవ్వడంతో పాటు గ్యాగ్ ఆర్డర్‌ కూడా హైకోర్టు ఇచ్చింది. దర్యాప్తును ఆపడంతో పాటు ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలను మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ ప్రచురించడానికి వీల్లేదని అసాధారణ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.

ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఏసీబీ దర్యాప్తు ఆపివేయడంతోపాటు, ఎఫ్‌ఐఆర్‌ను ప్రచురించకుండా ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌ను సవాల్ చేసింది. హైకోర్టు ఇచ్చిన స్టేతోపాటు గ్యాగ్ ఆర్డర్‌ను తక్షణం తొలగించాలని పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం కోరింది. దర్యాప్తును ప్రాథమిక దశలో అడ్డుకోకూడదని గతంలో సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పిందని… ఏపీ హైకోర్టు మాత్రం ఆ విషయాలను పట్టించుకోలేదని ఏపీ ప్రభుత్వం వివరించింది.

First Published:  21 Sep 2020 6:26 AM GMT
Next Story