పవన్ కోసం పాన్ ఇండియా టైటిల్

పవన్-క్రిష్ కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి పవన్ పుట్టినరోజు సందర్భంగా ప్రీ-లుక్ కూడా రిలీజ్ చేశారు. పవన్ గెటప్ ఇందులో డిఫరెంట్ గా ఉండబోతోందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఇదిలా ఉండగా ఇప్పుడీ సినిమా టైటిల్ పై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

సినిమా సెట్స్ పైకి వచ్చిన రోజే ‘విరూపాక్ష’ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అయితే దీనిపై పవన్ ఫ్యాన్స్ పెదవి విరిచారు. పవర్ స్టార్ రేంజ్ లో టైటిల్ లేదన్నారు. దీంతో ఆ టైటిల్ పక్కకెళ్లిపోయింది. తాజాగా మరో 2 టైటిల్స్ చక్కర్లు కొడుతున్నాయి.

సినిమాలో పవన్ కల్యాణ్, రాబిన్ హుడ్ తరహా పాత్ర పోషిస్తున్నాడు. మొఘల్ బ్యాక్ డ్రాప్ తో వజ్రాల దొంగతనం కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తోంది. కాబట్టి దీనికి ‘దొంగ’ అనే టైటిల్ పెట్టినట్టు కథనాలు వస్తున్నాయి. మరోవైపు ‘ఓం శివమ్’ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది.

అయితే ఇవన్నీ ప్రచారంలో ఉన్నవే తప్ప మేకర్స్ ప్రకటించినవి కావు. యూనివర్సల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్-ఇండియాలో రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు క్రిష్. సో.. టైటిల్ కూడా అన్ని భాషలకు సూట్ అయ్యేలా పెట్టే ఆలోచనలో ఉన్నాడు.