Telugu Global
National

నాన్నకు ప్రేమతో... తండ్రి శాఖలో సంతకాలు చేసిన నారా లోకేష్

ఫైబర్ గ్రిడ్‌ కుంభకోణంలో కొత్తకొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తన తండ్రి శాఖ పరిధిలోని వ్యవహారాల్లోనూ నారా లోకేష్ సంతకాలు చేసినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌ నెట్ లిమిటెడ్- ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ అన్నది తొలి నుంచి పెట్టుబడులు, మౌలిక సదుపాయల శాఖ పరిధిలో ఉంది. ఆ శాఖ అప్పట్లో చంద్రబాబునాయుడు వద్దనే ఉండేది. తండ్రి పరిధిలోని శాఖకు సంబంధించిన ఫైళ్లపై ఏమాత్రం సంబంధంలేని నారా లోకేష్‌ సంతకాలు చేశారు. భారత్‌ నెట్ ఫేజ్‌ -2కి సంబంధించిన […]

నాన్నకు ప్రేమతో... తండ్రి శాఖలో సంతకాలు చేసిన నారా లోకేష్
X

ఫైబర్ గ్రిడ్‌ కుంభకోణంలో కొత్తకొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తన తండ్రి శాఖ పరిధిలోని వ్యవహారాల్లోనూ నారా లోకేష్ సంతకాలు చేసినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌ నెట్ లిమిటెడ్- ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ అన్నది తొలి నుంచి పెట్టుబడులు, మౌలిక సదుపాయల శాఖ పరిధిలో ఉంది.

ఆ శాఖ అప్పట్లో చంద్రబాబునాయుడు వద్దనే ఉండేది. తండ్రి పరిధిలోని శాఖకు సంబంధించిన ఫైళ్లపై ఏమాత్రం సంబంధంలేని నారా లోకేష్‌ సంతకాలు చేశారు. భారత్‌ నెట్ ఫేజ్‌ -2కి సంబంధించిన ఫైల్‌పై నారా లోకేష్‌ సంతకం చేశారు. ఈ ఫైల్‌ను ఇప్పటి ప్రభుత్వం బయటపెట్టింది.

2వేల 200 రూపాయల విలువైన సెటాప్‌ బాక్స్‌లను 4,400కు కొనుగోలు చేసిన అంశాన్ని కూడా ప్రభుత్వం ఎత్తిచూపుతోంది. 12 లక్షల సెటాప్‌ బాక్స్‌ లు కొనుగోలు చేయగా… అందులో ఇప్పటికే 3 లక్షల 40వేల బాక్స్‌లు పనిచేయలేదని… దీన్ని బట్టే అవి ఎంత నాసిరకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది.

దాంతోపాటు లెక్కల్లో చూపిన సెటాప్‌ బాక్సుల్లో చాలా కనిపించడం లేదు అని చెబుతున్నారు. కేవలం కాగితాల మీద చూపి డబ్బులు తీసుకున్నారా అన్న అనుమానం కూడా ఉంది. ఈ బాక్స్‌లను కూడా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన కంపెనీలు తయారు చేశాయని ప్రభుత్వం గుర్తించింది.

First Published:  20 Sep 2020 10:14 PM GMT
Next Story