విచారణకు సిద్ధమే…. వేధిస్తే మాత్రం హైకోర్టుకు వెళ్తా – వేమూరి హరిప్రసాద్‌

ఏపీ ఫైబర్‌ గ్రిడ్ కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ హయాంలో ఐటీ సలహదారుడిగా పనిచేసిన వేమూరి హరిప్రసాద్ చెప్పారు. తాను ఎలాంటి జీతభత్యాలు తీసుకోకుండా పనిచేశానని చెప్పారు. కేవలం తాను సలహాలు ఇచ్చేందుకు మాత్రమే పరిమితమని చెప్పారు. తాను ఎలాంటి ఫైళ్లపై సంతకాలు చేయలేదని..అలా చేసే అధికారం కూడా తనకు లేదన్నారు.

ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ నారా లోకేష్‌ శాఖ పరిధిలోకి రాదని తెలుసని… కానీ ఆ రోజు చంద్రబాబునాయుడు అందుబాటులో లేకపోవడంతో లోకేష్‌ సంతకం చేశారని వేమూరి హరిప్రసాద్ చెప్పారు. వెంటనే తేరుకుని… ఇప్పుడే గుర్తుకు వచ్చింది… నేనే తప్పుగా మాట్లాడాను. నారా లోకేష్ సంతకం చేయలేదు అని హరిప్రసాద్‌ మాట మార్చారు.

గల్లా జయదేవ్‌ కంపెనీలో బాక్స్‌లు తయారు చేసింది నిజమేనని.. కానీ కేవలం 40వేల బాక్సులు మాత్రమే తయారు చేశామన్నారు. ఈ వ్యహారంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని… కానీ వేధిస్తే మాత్రం హైకోర్టును ఆశ్రయిస్తానని హరిప్రసాద్ హెచ్చరించారు.