సంక్రాంతికి మరో సినిమా రెడీ

ఈసారి సంక్రాంతికి మీడియం రేంజ్ సినిమాల సందడి బాగానే ఉన్నట్టుంది. ఇప్పటికే కొన్ని సినిమాలు సంక్రాంతిపై కన్నేయగా.. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ కూడా తన సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ మేరకు అఫీషియల్ స్టేట్ మెంట్ కూడా వచ్చేసింది.

కందిరీగ శ్రీనివాస్ దర్శకత్వంలో “అల్లుడు అదుర్స్” అనే సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని తాజాగా ప్రకటించారు. ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయేల్ కూడా నటిస్తోంది.

ఇప్పటికే సంక్రాంతి సినిమాల లిస్ట్ చాలా ఎక్కువైంది. నితిన్ నటిస్తున్న ‘రంగ్ దే’ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. అటు నాగచైతన్య నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమా కూడా సంక్రాంతికే వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు గోపీచంద్ ‘సీటీమార్’ కూడా సంక్రాంతికే వస్తుందంటున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి బెల్లంకొండ సినిమా కూడా చేరింది.

అయితే ఇవన్నీ ‘వకీల్ సాబ్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యేంత వరకే. పవన్ సినిమా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ అయితే ఇప్పటివరకు చెప్పుకున్న సినిమాలన్నీ తప్పుకున్నట్టే. లెట్స్ వెయిట్ అండ్ సీ.