ప్రభాస్ ఆ రిస్క్ చేస్తాడా?

కెరీర్ మంచి పీక్ స్టేజ్ లో ఉంది. చేతిలో ఉన్నవన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే. ఇండియా మొత్తం అతడి సినిమాల కోసం ఎదురుచూస్తోంది. ఇలాంటి టైమ్ లో ఓ నెగెటివ్ సెంటిమెంట్ ను తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రభాస్ ప్రయత్నిస్తున్నాడంటూ కథనాలు వస్తున్నాయి.

ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా ఎనౌన్స్ చేశాడు ప్రభాస్. ఇందులో నటించే ఇతర నటీనటుల వివరాల్ని యూనిట్ దశలవారీగా బయటపెడుతోంది. ఈ క్రమంలో ‘ఆదిపురుష్’ లో కృష్ణంరాజు ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఇది విని ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

ఫ్యాన్స్ షాక్ అవ్వడానికి ఇక్కడో రీజన్ ఉంది. వెండితెరపై ప్రభాస్-కృష్ణంరాజు కాంబినేషన్ పెద్దగా క్లిక్ అవ్వలేదు. ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో కృష్ణంరాజు ఉన్నారు. ఆ సినిమాను కొంతమంది హిట్ అంటారు, మరికొందరు యావరేజ్ అంటారు. అది ఆ సినిమా రిజల్ట్. ఇక వీళ్లిద్దరూ కలిసి చేసిన ‘రెబల్’ సినిమా క్లియర్ ఫ్లాప్.

వీళ్లిద్దరి కాంబినేషన్ కు ఉన్న ట్రాక్ రికార్డ్ ఇది. ఇలాంటి టైమ్ లో ప్రభాస్ సినిమాలో కృష్ణంరాజు ముఖ్యపాత్ర అనే సరికి ఆ పాత బ్యాడ్ సెంటిమెంట్ ను గుర్తుకుతెచ్చుకుంటున్నారు ఫ్యాన్స్.