బాబుకు కాగ్‌ భయం… అందుకే డిక్లరేషన్‌ రాద్దాంతం

చంద్రబాబు హఠాత్తుగా మొదలుపెట్టిన మతరాజకీయాలపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్పందించారు. తిరుమలలో డిక్లరేషన్ అంశంపై చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా వివాదం చేస్తున్న నేపథ్యంలో స్పందించిన సుబ్రమణ్యస్వామి… చంద్రబాబుకు కాగ్‌ భయం పట్టుకునే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.

టీడీపీ హయాంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై కాగ్‌తో దర్యాప్తు చేయించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకోవడం వల్లనే చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఇప్పుడు కాగ్‌ కారణంగా వణుకుతున్నారని.. అందుకే అనుకూల మీడియా ద్వారా తిరుమల దర్శనాలపై విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారని స్వామి విమర్శించారు.

స్వామి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడిని ఏ మతస్తుడు అని గుర్తించడం కష్టమని… ఆ ఉద్దేశంతోనే టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి ఆ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారని సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు.