అమెజాన్ లో బాలయ్య సినిమా….

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమాకు సంబంధించి అప్పుడే ప్రీ-రిలీజ్ బిజినెస్ మొదలైంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించునే అవకాశాలున్నాయి. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ సంస్థ ఏకంగా 9 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. డీల్ ఓకే అయితే.. బాలయ్య కెరీర్ లో అతిపెద్ద డిజిటల్ ఒప్పందం ఇదే అవుతుంది.

బాలయ్య-బోయపాటి కాంబోకు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి సింహా, లెజెండ్ సినిమాలు చేశారు. ఆ రెండూ బ్లాక్ బస్టర్ విజయాలందుకున్నాయి. ఈ నేపథ్యంలో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న తాజా చిత్రం మార్కెట్లో హాట్ కేక్ గా మారింది. అందుకే ఈ రేటు.

మరోవైపు ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా కనిపించడం లేదు. కరోనాకు ముందు కేవలం 15 రోజులు షూట్ చేసి సినిమాను ఆపేశారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు సెట్స్ పైకి వచ్చేది లేదని బాలయ్య అన్నట్టు సమాచారం. అయితే పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు కూడా వచ్చేనెల నుంచి సెట్స్ పైకి వస్తున్న నేపథ్యంలో.. బాలయ్య కూడా తన మనసు మార్చుకునే అవకాశం ఉంది.