దియా మీర్జా డ్రగ్స్ తీసుకుందా?

బాలీవుడ్ డ్రగ్స్ కేసు రకరకాల మలుపులు తీసుకుంటోంది. ఇప్పటికే దీనికి అనుబంధంగా శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. తాజాగా టాలీవుడ్ కనెక్షన్ కూడా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఏకంగా మహేష్ భార్య నమ్రత డ్రగ్స్ కేసులో ఉన్నట్టు జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరోయిన్ దియా మిర్జా కూడా చేరిపోయింది.

అవును.. నటి దియా మీర్జా కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు ఓ జాతీయ మీడియా కథనం ఇచ్చింది. గతేడాది జరిగిన ఓ డ్రగ్స్ పార్టీలో దియా మీర్జా పాల్గొన్నట్టు ఆ మీడియా ప్రకటించింది. దీంతో దియా మీర్జా వెంటనే రియాక్ట్ అయింది.

తను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని ప్రకటించింది దియా మీర్జా. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేస్తూ ట్వీట్ చేసింది.

ఇన్నేళ్లుగా కష్టపడి సంపాదించుకున్న పేరును చెడగొట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని, వాళ్లపై లీగల్ గా చర్యలు తీసుకుంటానని అంటోంది. ప్రస్తుతం నాగార్జున హీరోగా నటిస్తున్న వైల్డ్ డాగ్ అనే సినిమాలో దియా మీర్జా హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ లో ఆమెకిది రీఎంట్రీ మూవీ.