కాజల్ పెళ్లి మరోసారి వాయిదా?

కాజల్ పెళ్లిపై వచ్చినన్ని పుకార్లు, మరే హీరోయిన్ పెళ్లిపై వచ్చి ఉండవేమో. దాదాపు ఐదేళ్లుగా చందమామపై గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. వాటిని ఆమె ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. అయితే ఈసారి ఆమె పెళ్లికి సంబంధించి ఓ వెరైటీ పుకారు ప్రచారంలోకి వచ్చింది. ఆమె ఈ ఏడాది పెళ్లి చేసుకోదట.

ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తతో కాజల్ కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తోందనే ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. ఆ వ్యాపారవేత్తనే కాజల్ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటుందని అంతా అనుకున్నారు. అయితే ఓవైపు కరోనా రావడం, ప్రపంచం స్తంభించిపోవడంతో కాజల్ తన పెళ్లిని వాయిదా వేసుకుందట.

మరోవైపు ఊహించని విధంగా తనకు పెద్ద పెద్ద సినిమా ఆఫర్లు కూడా రావడంతో ఆమె పెళ్లిని మరో ఏడాది పోస్ట్ పోన్ చేసుకున్నట్టు వార్తలొస్తున్నాయి.

తెలుగులో ఆమె చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తోంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. అప్పుడు కాజల్ కూడా జాయిన్ అవుతుంది.

మరోవైపు మంచు విష్ణు నటిస్తున్న మోసగాళ్లు అనే సినిమాలో కూడా, హీరోకు చెల్లెలిగా కాజల్ నటిస్తోంది. అటు తమిళనాట కూడా కాజల్ చేతిలో 2 సినిమాలున్నాయి. ఇవి కాకుండా త్వరలోనే ఆమె శాండిల్ వుడ్ లో కూడా అడుగుపెట్టబోతోంది.