కీర్తి సురేష్ పై మరింత క్లారిటీ

మహేష్ బాబు హీరోగా నటించబోతున్న సర్కారువారి పాట సినిమాలో తను ఉన్నానని గతంలో స్వయంగా ప్రకటించింది కీర్తిసురేష్. అయినప్పటికీ ఆమె ఎంట్రీపై ఇప్పుడు కొత్త కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆమెను సినిమా నుంచి తప్పించారని, ఆమె స్థానంలో ఓ బాలీవుడ్ బ్యూటీని తీసుకునే ఆలోచనలో ఉన్నారంటూ వరుసగా కథనాలు వస్తున్నాయి.

ఇలా కీర్తిసురేష్ ఎంట్రీపై ఊహించని విధంగా నెగెటివ్ కథనాలు రావడంతో యూనిట్ అప్రమత్తమైంది. కీర్తిసురేష్ పై క్లారిటీ ఇచ్చింది. సర్కారువారి పాట సినిమాలో కీర్తిసురేష్ ఉందని, ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకునే ఆలోచన లేదని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు, అమెరికాలో షూట్ కోసం కీర్తిసురేష్ వీసా పనులు కూడా మొదలుపెట్టినట్టు తెలిపారు.

ఇలా కీర్తిసురేష్ పై వచ్చిన కథనాలకు ‘మైత్రీ’ ప్రకటనతో ఫుల్ స్టాప్ పడింది. త్వరలోనే అమెరికాలోని డెట్రాయిట్ లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ప్రారంభించబోతున్నారు.