బెయిల్ పిటిషన్ లో రియా ఏం చెప్పిందంటే….

ఓవైపు ముంబయి సెషన్స్ కోర్టు రియా రిమాండ్ ను పొడిగించింది. వచ్చేనెల 6 వరకు ఎన్సీబీ కస్టడీలో ఉండాలని ఆదేశించింది. అదే టైమ్ లో రియా హైకోర్టు మెట్లు ఎక్కింది. తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ముంబయి హైకోర్టులో 47 పేజీల పిటిషన్ పెట్టుకుంది. లెక్కప్రకారం ఆ పిటిషన్ ఈరోజు విచారణకు రావాలి. కానీ రియాకు మరో రోజు వెయిటింగ్ తప్పలేదు.

ముంబయిలో జోరుగా వానలు కురుస్తున్నాయి. ఆఫీసులన్నీ మూతపడ్డాయి. హైకోర్టు కూడా మూతపడింది. దీంతో రియా బెయిల్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు.

ఓవైపు విచారణ వాయిదాపడినా, బెయిల్ పిటిషన్ లో రియా ఏం చెప్పిందనే విషయాలు బయటకొచ్చాయి. ఈ మేరకు కొన్ని జాతీయ మీడియా ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. మొత్తం టీమ్ లో సుశాంత్ ఒక్కడే డ్రగ్స్ తీసుకుంటాడనని.. స్టాఫ్ ను, తనను డ్రగ్స్ సరఫరాదారులుగా సుశాంత్ వాడుకున్నాడని.. రియా బెయిల్ పిటిషన్ లో ఆరోపించినట్టు జాతీయ మీడియా తెలిపింది. రేపు విచారణ సందర్భంగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.