ఆర్ఆర్ఆర్ కోసం అలియా రెడీ

సినిమాలన్నీ ఇప్పుడిప్పుడే సెట్స్ పైకి వస్తున్న టైమ్ లో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో కూడా మెల్లగా కదలిక వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ రెండో వారం నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఈ మేరకు తక్కువ సిబ్బందితో వర్క్ చేసేందుకు షెడ్యూల్స్ ను చిన్న చిన్న పోర్షన్లుగా విడగొడుతున్నాడు.

మరోవైపు ఆర్ఆర్అర్ కు అలియాభట్ కాల్షీట్లు కేటాయించింది. అక్టోబర్-నవంబర్ నెలల్లో తను పూర్తిగా ఫ్రీగా ఉంటానని.. ఆ టైమ్ లో షూటింగ్ పెట్టుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని యూనిట్ కు చెప్పేసింది. హైదరాబాద్ వచ్చి ఏకంగా 2 నెలలు ఉండి, ఒకేసారి సినిమా పూర్తిచేస్తానని హామీ ఇచ్చింది.

దీంతో అక్టోబర్ లో అలియా-రామ్ చరణ్ ను సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు రాజమౌళి ట్రై చేస్తున్నాడు. రాబోయే 2 నెలల్లో అలియా పోర్షన్ పూర్తిచేస్తే ప్రాజెక్టుకు సంబంధించి పెద్ద పని పూర్తయినట్టవుతుంది.

దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది ఈ సినిమా. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ పేట్రియాటిక్ మూవీలో కొమరం భీమ్ గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించబోతున్నారు.