ఎప్పుడు పిలిస్తే అప్పుడు సెట్స్ పైకి వస్తుందట…

వకీల్ సాబ్ సినిమా మళ్లీ సెట్స్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మేకర్స్ మరోసారి శృతిహాసన్ ను సంప్రదించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి శృతిహాసన్ ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే సెట్స్ పైకి వద్దామనుకునే టైమ్ కు లాక్ డౌన్ పడ్డంతో శృతిహాసన్ ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది.

వకీల్ సాబ్ మరోసారి సెట్స్ పైకి రావడంతో.. ఈసారి శృతిహాసన్ కాల్షీట్లు దొరుకుతాయా దొరకవా లేక హీరోయిన్ వ్యవహారం మరోసారి మొదటికొస్తుందా అనే టెన్షన్ లో యూనిట్ పడింది. అయితే శృతి మాత్రం వకీల్ సాబ్ యూనిట్ కు పూర్తి భరోసా ఇచ్చింది. రాబోయే 2 నెలల్లో ఎప్పుడు పిలిస్తే అప్పుడు షూటింగ్ కు వస్తానని హామీ ఇచ్చింది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. అక్టోబర్ నుంచి పవన్ సెట్స్ పైకి వస్తాడట. పవన్ తో పాటు శృతిహాసన్ కూడా సెట్స్ పైకి రావాల్సి ఉంటుంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సీన్స్ తీస్తే టోటల్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. సంక్రాంతికి వకీల్ సాబ్ ను దించాలనేది దిల్ రాజు ప్లాన్.