వెధవ పనులు చేసినా సీబీఐ విచారణ వద్దట… జనం రోడ్ల మీదకొచ్చి ఉద్యమిస్తే అప్పుడు సెట్‌ అవుతుంది

న్యాయవ్యవస్థలో జరుగుతున్న పరిణామాలపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెధవ పనులు చేస్తున్నా వారిపై సీబీఐ విచారణ జరపకూడదా అని ప్రశ్నించారు.

” నిన్న కోర్టులో సీబీఐ ఎంక్వైరీ వేయకూడదట. అక్కడ లేనిపోని వెధవ పనులన్నీ చేస్తున్నారు. సీబీఐ ఎంక్వైరీ వేయకూడదట, ఎఫ్‌ఐఆర్‌ కూడా పత్రికల్లో రాకూడదట. ఇలా తగలబడింది. చూద్దాం. ప్రజలే నిర్ణయిస్తారు. ఏదో ఒక రోజు ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఉద్యమిస్తే అప్పుడు సెట్‌ అవుతుంది. ఆ రోజు వస్తుంది. 30 లక్షల ఇళ్ల పట్టాలను ఆపారు, ఊరుకుంటారా. ఆ మహానుభావుడు జగన్‌మోహన్ రెడ్డి ఎందుకో చూద్దాం చూద్దాం అంటూ మౌనం వహించాడు. మౌనం బద్ధలైతే ప్రళయం లేస్తది. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని ఆపడానికి వీల్లేదు. గౌరవం ఇస్తున్నాం. ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి.” అంటూ స్పీకర్‌ తీవ్రంగా స్పందించారు.

వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేస్తూ అన్యాయానికి అండగా కొమ్ముకాస్తున్న తీర్పులు… చట్టం, న్యాయం చంద్రబాబు చేతిలో…

Publiée par Devendra Reddy Gurrampati sur Mardi 22 septembre 2020