Telugu Global
Health & Life Style

పదిహేడు రోజుల క్వారంటైన్ తరువాత... పాజిటివ్ వస్తే....!

ఛండీగర్ లో ఒక సీనియర్ డాక్టరు చికిత్స చేస్తున్న కరోనా పేషంటు ఒకరు 17 రోజులపాటు క్వారంటైన్ లో ఉన్నాడు. ఆ గడువు పూర్తయ్యాక అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నా…  ఎందుకైనా మంచిదని అతణ్ణి కరోనా టెస్టు చేయించుకోమని సదరు డాక్టరు సూచించారు. అతను పరీక్ష చేయించుకోగా రిజల్ట్ పాజిటివ్ వచ్చింది.  దాంతో ఆ వ్యక్తి మరొక పదిహేడు రోజులపాటు క్వారంటైన్లో ఉండాలని కోవిడ్ నియంత్రణ అధికారులు చెప్పారు. అతనికి చికిత్స చేస్తున్న వైద్యుడు…. సెక్టార్ పదహారులోని […]

పదిహేడు రోజుల క్వారంటైన్ తరువాత... పాజిటివ్ వస్తే....!
X

ఛండీగర్ లో ఒక సీనియర్ డాక్టరు చికిత్స చేస్తున్న కరోనా పేషంటు ఒకరు 17 రోజులపాటు క్వారంటైన్ లో ఉన్నాడు. ఆ గడువు పూర్తయ్యాక అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నా… ఎందుకైనా మంచిదని అతణ్ణి కరోనా టెస్టు చేయించుకోమని సదరు డాక్టరు సూచించారు. అతను పరీక్ష చేయించుకోగా రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. దాంతో ఆ వ్యక్తి మరొక పదిహేడు రోజులపాటు క్వారంటైన్లో ఉండాలని కోవిడ్ నియంత్రణ అధికారులు చెప్పారు.

అతనికి చికిత్స చేస్తున్న వైద్యుడు…. సెక్టార్ పదహారులోని గవర్నమెంట్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ డిప్యుటీ మెడికల్ సూపరెంటెండెంట్ కి ఈ విషయంపై లేఖ రాశాడు. 17 రోజులపాటు క్వారంటైన్ లో ఉన్న తరువాత కూడా పాజిటివ్ వస్తే ఏం చేయాలి…ఈ విషయంపై ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలు ఏమిటి… అని ప్రశ్నిస్తూ… దీని గురించి వైద్యులకు మార్గదర్శకాలు ఇవ్యాలని ఆయన తన లేఖలో కోరాడు.

‘ పదిహేడు రోజుల క్వారంటైన్ తరువాత అసలు టెస్ట్ చేయించుకోవద్దని ప్రభుత్వం చెబుతోంది. క్వారంటైన్ తరువాత బయటకు వెళ్లినవారు పరీక్ష చేయించుకుంటే అందులో చాలామందికి పాజిటివ్ వస్తుంది. అలాగే ఇతనికీ వచ్చింది. అతను మరోసారి క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఓ అయిదు రోజులు ఇంట్లో ఉంటే సరిపోతుంది. పాజిటివ్ వచ్చినవారిలో పదిహేను రోజుల తరువాత… వైరస్ తాలూకూ రేణువులు ఉన్నా వాటి వలన పెద్దగా హాని ఉండదు. వాటి కారణంగా వైరస్ వ్యాప్తి జరగదు. ఈ విషయంపై ప్రభుత్వ విధానం ఏమిటో చెప్పాలి.’ ఆ వైద్యుడు తన లేఖలో పేర్కొన్న అంశాలివి.

క్వారంటైన్ పూర్తయి, లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాక కూడా కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని అయితే వీరి నుండి వైరస్ మరొకరికి సోకే ప్రమాదం ఉండదని మే 27న ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఫార్టిస్ హాస్పటల్ ఇంటర్నల్ మెడిసిన్ డైరక్టర్ డాక్టర్ వికాస్ భూటానీ ఈ విషయంపై స్పందిస్తూ… కోవిడ్ తాలూకూ అనారోగ్యం మొదలైన తరువాత కొన్ని రోజులకు వైరస్ తీవ్రత తగ్గుతుందని, పదిరోజులకు అది అసలు పట్టించుకోవాల్సిన స్థితిలోనే ఉండదని అంటున్నారు.

ఒకసారి కోవిడ్ పాజిటివ్ వచ్చి తగ్గిన తరువాత… మూడునెలల లోపు మళ్లీ మళ్లీ పాజిటివ్ చూపిస్తున్నా దానిని కోవిడ్ గా పరిగణించలేమని… అది మొదటి ఇన్ ఫెక్షన్ తాలూకూ పాజిటివ్ గానే భావించాలని… మూడు నెలల అనంతరం పాజిటివ్ వస్తే… దానిని మరోసారి వైరస్ సోకినట్టుగా పరిగణించాలని డాక్టర్ వికాస్ భూటానీ చెబుతున్నారు. ఏదేమైనా ఈ విషయంపై ప్రభుత్వం నుండి మరింత స్పష్టత రావాల్సి ఉంది.

First Published:  24 Sep 2020 9:02 AM GMT
Next Story