అఖిలప్రియకు నోటీసులు

మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఫిర్యాదు మేరకు సీఐడీ చర్యలు మొదలుపెట్టింది. కర్నూలులో కరోనా వైరస్‌ వ్యాప్తికి ఎమ్మెల్యే హఫీజ్ ఖానే కారణమంటూ ఆమె ఆరోపించారు.

హఫీజ్‌ఖాన్ క్వారంటైన్ సెంటర్లకు వెళ్లి కరోనా వ్యాప్తి చేశారని ఆమె ఇటీవల ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై హఫీజ్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. సీఐడీకి ఫిర్యాదు చేశారు. గురువారం విచారణకు రావాల్సిందిగా ఆమెకు నోటీసులు ఇచ్చారు.

ఇటీవల అఖిలప్రియతో పాటు ఆమె భర్తపైనా అనేక ఆరోపణలు వస్తున్నాయి. కేసులు నమోదు అవుతున్నాయి. అఖిలప్రియ భర్త ఒక వ్యక్తికి సంబంధిన ఫ్యాక్టరీని బలవంతంగా రాయించుకునేందుకు అతడిని బంధించి చిత్రహింసలుపెట్టారు. ఈ అంశంలోనే ఆమె భర్తపై కేసు నమోదు అయింది. టీడీపీ నేత సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించిన కేసులోనూ అఖిలప్రియ దంపతులపై కేసు నమోదు అయింది.