Telugu Global
National

మహారాష్ట్రలో... 13మంది మంత్రులకు కరోనా పాజిటివ్ !

మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఏకనాథ్ షిండే తనకు కరోనా సోకిందని చెబుతూ…. తనతో ఎవరైతే సన్నిహితంగా మెలిగారో… వారంతా టెస్ట్ చేయించుకోవాలని కోరారు. షిండే ఈ వారం మొదట్లో కేబినెట్ మీటింగ్ కి హాజరయ్యారు. షిండేతో కలిపి మొత్తం 13 మంది మహారాష్ట్ర మంత్రులు కోవిడ్ బారిన పడ్డారు. మహారాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా  మొత్తం 43 మంది ఉన్నారు. మహారాష్ట్రలో కోవిడ్ కేసుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. బుధవారం నాడు ఇక్కడ నమోదైన కేసులు […]

మహారాష్ట్రలో... 13మంది మంత్రులకు కరోనా పాజిటివ్ !
X

మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఏకనాథ్ షిండే తనకు కరోనా సోకిందని చెబుతూ…. తనతో ఎవరైతే సన్నిహితంగా మెలిగారో… వారంతా టెస్ట్ చేయించుకోవాలని కోరారు. షిండే ఈ వారం మొదట్లో కేబినెట్ మీటింగ్ కి హాజరయ్యారు. షిండేతో కలిపి మొత్తం 13 మంది మహారాష్ట్ర మంత్రులు కోవిడ్ బారిన పడ్డారు. మహారాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం 43 మంది ఉన్నారు.

మహారాష్ట్రలో కోవిడ్ కేసుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. బుధవారం నాడు ఇక్కడ నమోదైన కేసులు 21,029 కాగా మొత్తం కేసుల సంఖ్య 12.63 లక్షలు. దేశంలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మొదటి అయిదు రాష్ట్రాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్. అయితే కాస్త సంతోషించాల్సిన విషయం ఏమిటంటే… ఈ అయిదు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్నట్టుగా లెక్కలు చెబుతున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్లో గత రెండు వారాల్లో యాక్టివ్ కేసులు 30 శాతం వరకు తగ్గాయి. కొన్నిరోజులుగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గుతూ… రికవరీలు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో గతవారం రోజులుగా యాక్టివ్ కేసులు పదిశాతం వరకు తగ్గాయి. ఈ నెల పదిహేడు నాటికి మూడు లక్షలకు పైగా ఉన్న కేసులు తగ్గుముఖం పట్టి ఇప్పుడు 2 లక్షల 73 వేల వరకు ఉన్నాయి. అయితే తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, కర్ణాటకల్లో తగ్గుదల ఇంతస్థాయిలో లేకపోయినా గుర్తించదగిన స్థాయిలోనే కేసులు తగ్గుముఖం పడుతున్నట్టుగా తెలుస్తోంది.

First Published:  24 Sep 2020 9:34 AM GMT
Next Story