సెట్స్ పైకొచ్చిన కొత్త పెళ్లికొడుకు

ఈ లాక్ డౌన్ టైమ్ లోనే పెళ్లి చేసుకున్నాడు నితిన్. ప్రస్తుతం ఇంట్లోనే హనీమూన్ సెటప్ కూడా పెట్టుకున్నాడు. ఇలాంటి టైమ్ లో అతడు తన కొత్త సినిమా స్టార్ట్ చేస్తాడని ఎవ్వరూ ఊహించరు. కానీ నితిన్ మాత్రం సెట్స్ పైకి వచ్చేశాడు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న రంగ్ దే సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశాడు నితిన్. కరోనా నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకొని సెట్స్ పైకి వచ్చారు. నితిన్, ఇతర నటీనటులపై కొన్ని సన్నివేశాలు తీశారు.

కొంత టాకీ పార్ట్ తో పాటు, పాటల షూటింగ్ పెండింగ్ ఉంది. వీలైనంత త్వరగా వాటిని పూర్తిచేస్తామని మేకర్స్ ప్రకటించారు. కుదిరితే సంక్రాంతికి వస్తామంటూ టీజర్ లో చెప్పిన మేకర్స్, ఈసారి ఆ విషయాన్ని కాస్త ధైర్యంగా, ఇంకాస్త గట్టిగా చెప్పారు. 2021 సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫర్.