రియాకు హైకోర్టులో చుక్కెదురు…

ఈరోజుపై రియా ఎన్నో ఆశలు పెట్టుకుంది. తనకు బెయిల్ వచ్చేస్తుందని రేపటికి ఇంటికి వెళ్లిపోవచ్చని అనుకుంది. కానీ ముంబయి హైకోర్టు రియాకు ఝలక్ ఇచ్చింది. ఈరోజు ఆమె బెయిల్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. తదుపరి విచారణను 29వ తేదీకి వాయిదా వేసింది.

ఎన్సీబీ అధికారుల అదుపులో ఉంది రియా. బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకానికి సంబంధించి అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చేనెల 6 వరకు ఆమెకు రిమాండ్ విధిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ తీర్పును ముంబయి హైకోర్టులో రియా సవాల్ చేసింది. 47 పేజీల సుదీర్ఘ బెయిల్ పిటిషన్ పెట్టుకుంది.

లెక్కప్రకారం నిన్ననే రియా బెయిల్ పిటిషన్ పై విచారణ జరగాలి. కానీ వర్షాల కారణంగా ఇవాళ్టికి విచారణను వాయిదా వేశారు. ఈరోజు బెంచ్ పైకొచ్చిన ఈ పిటిషన్ ను 29కు వాయిదా వేశారు. దీంతో మరో 5 రోజుల పాటు రియా…. బైకుల్లా జైలులోనే గడపాల్సి ఉంటుంది.