జగన్‌ క్రిస్టియన్ కాదేమో ! – బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి

తిరుమలలో డిక్లరేషన్‌పై జగన్‌మోహన్ రెడ్డి సంతకం చేయాలని తామెక్కడా డిమాండ్ చేయలేదన్నారు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి. కేవలం ఆచారాన్ని పాటించాలని మాత్రమే డిమాండ్ చేశాం గానీ… ప్రత్యేకంగా ఒక వ్యక్తినే లక్ష్యంగా చేసుకోలేదన్నారు. బీజేపీ భుజాలపై తుపాకి పెట్టి కాల్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జగన్‌ తిరుమల వెళ్లారని…. అప్పుడెందుకు డిక్లరేషన్‌పై సంతకం తీసుకోలేదో టీడీపీ చెప్పాలన్నారు.

డిక్లరేషన్‌పై జగన్మోహన్ రెడ్డి సంతకం చేయలేదు అంటే ఆయన అన్యమతస్తుడు కాదేమో అని విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం తిరుమల పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ ఎక్కడా చెప్పలేదన్నారు.