ఒక సినిమా రిలీజ్ అవ్వకముందే మరో ఆఫర్…

రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్ కలిసి ఫస్ట్ టైమ్ ఒరేయ్ బుజ్జిగా అనే సినిమా చేశారు. అదింకా రిలీజ్ కాలేదు. మరో వారం రోజుల్లో ఆహా యాప్ లో డైరక్ట్ గా రిలీజ్ అవ్వబోతోంది. దాని రిజల్ట్ రాకముందే విజయ్ కుమార్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు రాజ్ తరుణ్.

వీళ్లిద్దరి కాంబినేషన్ లో రెండో సినిమా ఈరోజు స్టార్ట్ అయింది. వ‌న‌మాలి క్రియేష‌న్స్ బ్యానర్ పై మ‌హిద‌ర్‌, దేవేష్ నిర్మాత‌లుగా ఒక డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ మూవీ హైద‌రాబాద్ కోకాపేట‌‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్.రామారావు క్లాప్ కొట్టగా ప్ర‌ముఖ నిర్మాత గోపినాథ్ ఆచంట కెమెరా స్విచాన్ చేశారు.

ఒరేయ్ బుజ్జిగా సినిమా కంప్లీట్ లవ్ ఎంటర్ టైనర్. కానీ ఈ కొత్త సినిమా మాత్రం లవ్-ఎంటర్ టైన్ మెంట్ ఉంటూనే థ్రిల్ కూడా ఇస్తుందంటున్నాడు రాజ్ తరుణ్. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఒరేయ్ బుజ్జిగా సినిమాకు సంగీతం అందించిన అనూప్ రూబెన్స్, ఈ సినిమాకు కూడా సంగీతం అందించబోతున్నాడు.