Telugu Global
National

కొంత మంది వస్తే ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారా? " సజ్జల

న్యాయస్థానాలు పెద్దరికంతో తీర్పులు ఇవ్వాలని కోరారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. కోర్టులకు ఉద్దేశాలను తాము ఆపాదించడం లేదని… కానీ కోర్టులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం సరిగా లేవన్నారు. డీజీపీని రాజీనామా చేసి వెళ్లిపోండి అని కోర్టులు వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మీరు ఎలా సంతృప్తి పరుస్తారో మాకు తెలుసులే అంటూ న్యాయస్థానాలు వ్యాఖ్యానించడంపైనా అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం ఉందా లేదా అంటూ మాట్లాడడం ఏమిటని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలపై వ్యాఖ్యలు చేయడం అంటే శాసనవ్యవస్థను కించపరచడమేనన్నారు. […]

కొంత మంది వస్తే ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారా?  సజ్జల
X

న్యాయస్థానాలు పెద్దరికంతో తీర్పులు ఇవ్వాలని కోరారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. కోర్టులకు ఉద్దేశాలను తాము ఆపాదించడం లేదని… కానీ కోర్టులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం సరిగా లేవన్నారు. డీజీపీని రాజీనామా చేసి వెళ్లిపోండి అని కోర్టులు వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మీరు ఎలా సంతృప్తి పరుస్తారో మాకు తెలుసులే అంటూ న్యాయస్థానాలు వ్యాఖ్యానించడంపైనా అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం ఉందా లేదా అంటూ మాట్లాడడం ఏమిటని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వాలపై వ్యాఖ్యలు చేయడం అంటే శాసనవ్యవస్థను కించపరచడమేనన్నారు. ఎక్కడో భార్యభర్త మధ్య గొడవ విషయంలో ఏకంగా డీజీపీ … రాజీనామా చేయండి అని వ్యాఖ్యానిస్తే ఇక పోలీసు వ్యవస్థ గౌరవం ఏమైపోవాలని ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్లో, ఘోరాలో జరిగినప్పుడు ఈ తరహా కామెంట్స్‌ చేసినా అర్థముంది కానీ… చిన్న విషయాలకు కూడా పోలీసు వ్యవస్థ గౌరవాన్ని తగ్గించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నది తమ అభిప్రాయమన్నారు.

ఎవరు ఎవరిపైనా వ్యక్తిగత కామెంట్స్ చేయడం సరికాదన్నారు. ప్రధానిపై కొడాలి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమై ఉండవచ్చన్నారు. ఏ ఉద్దేశంతో కొడాలి నాని ఆ వ్యాఖ్యలు చేశారో తాను చూడలేదన్నారు. కొడాలినానిని ప్రశ్నిస్తున్న వారు జగన్‌మోహన్ రెడ్డి గురించి వారు చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వైసీపీ నేతలను కావాలనే టీడీపీ వారు రెచ్చగొడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ ఉచ్చులో పడకూడదని తమ పార్టీ నేతలను కోరుతున్నామన్నారు.

ప్రభుత్వంలోకి వచ్చి తాము ఏడాదిన్నర కూడా కాలేదని… అప్పుడే ఇంత రభస ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. సున్నితమైన అంశాలపై చర్చ పెట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారా? ఎక్కడెక్కడో ఏదోచేస్తే కొందరు వస్తే ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారా?. అని ప్రశ్నించారు.

సున్నితమైన అంశాలపై చర్చ పెట్టి ఒక సంక్షోభం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కానీ ఈ చర్యల వల్ల అభాసుపాలవడం తప్ప మరే ఉపయోగం ఉండదన్నారు.

First Published:  24 Sep 2020 8:49 PM GMT
Next Story