Telugu Global
National

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. తొలుత కరోనా బారినపడ్డ ఎస్పీ చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. కరోనాను జయించినప్పటికీ ఆ తర్వాత ఇతర సమస్యలు వచ్చాయి. ఆరోగ్యం సహకరించలేదు. దాదాపు 50 రోజులుగా ఆయన వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. 1946 జూన్‌ 4న ఆయన నెల్లూరులోని కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. 1966లో శ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రానికి తొలిసారి పాట పాడారు. […]

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత
X

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. తొలుత కరోనా బారినపడ్డ ఎస్పీ చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. కరోనాను జయించినప్పటికీ ఆ తర్వాత ఇతర సమస్యలు వచ్చాయి. ఆరోగ్యం సహకరించలేదు. దాదాపు 50 రోజులుగా ఆయన వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు.

1946 జూన్‌ 4న ఆయన నెల్లూరులోని కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. 1966లో శ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రానికి తొలిసారి పాట పాడారు. ఆ తర్వాత పాటల ప్రవాహం కొనసాగింది. నాలుగు దశాబ్దాల పాటు 16 భాషల్లో ఎస్పీ పాటల ప్రస్తానం సాగింది. 40వేలకు పైగా పాటలు పాడారు. ఇది గిన్నిస్ రికార్డు. పలు చిత్రాల్లో ఆయన నటించారు.

1969లో పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారి నటుడిగా కనిపించారు. తమిళ ‘కేలడి కన్మణి’లో హీరో పాత్ర పోషించారు. ఈ సినిమా తెలుగులో ఓ పాప లాలీ పేరుతో విడుదలైంది. ప‌విత్ర బంధం, దేవుళ్లు, దేవదాస్‌, మిథునం వంటి ప‌లు సినిమాల్లోనూ బాలు న‌టించారు.

బాలు మరణం పట్ల వివిధ రంగాలకు చెందిన వారు సంతాపం తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు బాలు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎస్పీ బాలు తమ నెల్లూరు జిల్లాలో జన్మించడాన్ని ఆ జిల్లాకు చెందిన వ్యక్తిగా అదృష్టంగా భావిస్తానని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

First Published:  25 Sep 2020 3:36 AM GMT
Next Story