Telugu Global
National

బాలు ప్రాణాలమీదకు తెచ్చిన తెలుగు టీవీ చానల్‌

50రోజులుగా చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు నేడు చెన్నైలోని రెడ్ హిల్స్‌ ఫాంహౌజ్‌లో జరుగనున్నాయి. బాలు కరోనా బారినపడి ఉండకపోతే ఆయన ప్రాణాల మీదకు వచ్చి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 74ఏళ్ల వయసు కావడంతో… కరోనా వైరస్ దేశంలో బయటపడినప్పటి నుంచి బాలు పలు జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. లాక్‌డౌన్‌ నుంచి చెన్నైలోని తన నివాసానికే పరిమితం అయ్యారు. తన ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, వ్యక్తుల గురించి వివరిస్తూ […]

బాలు ప్రాణాలమీదకు తెచ్చిన తెలుగు టీవీ చానల్‌
X

50రోజులుగా చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు నేడు చెన్నైలోని రెడ్ హిల్స్‌ ఫాంహౌజ్‌లో జరుగనున్నాయి.

బాలు కరోనా బారినపడి ఉండకపోతే ఆయన ప్రాణాల మీదకు వచ్చి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 74ఏళ్ల వయసు కావడంతో… కరోనా వైరస్ దేశంలో బయటపడినప్పటి నుంచి బాలు పలు జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. లాక్‌డౌన్‌ నుంచి చెన్నైలోని తన నివాసానికే పరిమితం అయ్యారు.

తన ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, వ్యక్తుల గురించి వివరిస్తూ ఆయన రోజుకో వీడియో విడుదల చేసేవారు. ఇంతలోనే ఒక తెలుగు చానల్‌ నుంచి ఆయనకు కబురు వచ్చింది. సదరు చానల్ నిర్వహించే ఒక సంగీత కార్యక్రమ ధారావాహికలో ఎస్పీ బాలు చాలాకాలంగా కీలకంగా ఉంటున్నారు. ఆ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు గాను రావాల్సిందిగా ఆ చానల్ నుంచి కబురు వచ్చింది.

తొలుత వారి పిలుపును ఎస్పీ బాలు తిరస్కరించారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని, తానురాలేనని… దయచేసి కొద్దిరోజులు ఒత్తిడి తేవద్దు అని విజ్ఞప్తి చేశారు. అయినా వారు వినిపించుకోలేదు. చానల్‌ పెద్దవారే ఫోన్‌ చేసి ఎస్పీ బాలుపై హైదరాబాద్‌ రావాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని చెబుతున్నారు. దాంతో కాదనలేక భార్య, కుమారుడు, వ్యక్తిగత సహాయకుడితో కలిసి హైదరాబాద్‌ వెళ్లారు.

అక్కడి ఆర్కెస్ట్రా ట్రూప్‌ సిబ్బందితో కలిసి మూడు రోజుల పాటు కార్యక్రమం చేశారు. ఆ ట్రూప్‌లోని వారిలో 23 మందికి కరోనా అని తేలింది. ఎస్పీ బాలు చెన్నై వెళ్లిపోయిన తర్వాత కొద్ది రోజులకు ఆయన అస్వస్థతకు గురయ్యారు. పరీక్షలు నిర్వహించగా కరోనా అని తేలింది. బాలు వయసు 74 సంవత్సరాలు కావడంతో ప్రాణాలతో బయటపడలేకపోయారు. కరోనాను జయించినా, దాని వల్ల ఇతర సమస్యలు వచ్చి ఆయన ప్రాణాలు వదిలారు. ఆ చానల్‌ ఒత్తిడి చేసి ఉండకపోతే… ఆయన ఇంటికే పరిమితం అయ్యేవారని, ఈ పరిస్థితి వచ్చేది కాదని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  25 Sep 2020 9:11 PM GMT
Next Story