బాలుకు భారతరత్న ఇవ్వాల్సిందే….

గ్రేట్ సింగర్ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. తమిళనాడు సర్కార్… ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు పూర్తిచేసింది. ఓ మహాప్రస్థానం ముగిసింది. ఓ చరిత్రకు తుదివాక్యం పలికింది విధి. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు భారతరత్న అంశం తెరపైకి వచ్చింది.

అవును.. గానగంధర్వుడికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అతడి అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు. సోషల్ మీడియాలో ఉద్యమంగా సాగుతున్న ఈ డిమాండ్ కు సీనియర్ హీరో అర్జున్ కూడా వత్తాసు పలికాడు. భారత్ లో బాలును మించిన గాయకుడు లేడంటున్నాడు అర్జున్. పైగా వివాదరహితుడైన బాలుకు భారతరత్న ఇవ్వడం అన్ని విధాలుగా సమంజసం అంటున్నాడు.

అది నిజమే.. తన రంగంలో బాలు ఓ శిఖరం. ఆ శిఖరాన్ని తాకడం మరో గాయకుడి వల్ల కాకపోవచ్చు. బాలుకు అవార్డులు అక్కర్లేదు, ఆయన ఎప్పుడూ వాటిని కోరుకోలేదు కూడా. కానీ ఈ టైమ్ లో ఆయనకు భారతరత్న ప్రకటించడం అత్యవసరం. ఆయనకు ఇచ్చే గౌరవం, అతిపెద్ద గుర్తింపు అదే. కాదంటారా..!