Telugu Global
National

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్

ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు మరో వెసులుబాటు కల్పించింది. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో నెగిటివ్ మార్కుల విధానాన్ని తొలగించింది. 2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ నెగిటివ్ మార్కుల విధానాన్ని తెచ్చారు. పరీక్షల్లో ఒక తప్పుకు 1/3 వంతున మార్కులు మైనస్ చేసేవారు. దీని వల్ల సరైన సమయంలో పదోన్నతులు పొందలేకపోతున్నామని ఉద్యోగులు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా… ఆయన సానుకూలంగా స్పందించారు. నెగిటివ్ మార్కుల విధానాన్ని […]

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్
X

ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు మరో వెసులుబాటు కల్పించింది. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో నెగిటివ్ మార్కుల విధానాన్ని తొలగించింది.

2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ నెగిటివ్ మార్కుల విధానాన్ని తెచ్చారు. పరీక్షల్లో ఒక తప్పుకు 1/3 వంతున మార్కులు మైనస్ చేసేవారు. దీని వల్ల సరైన సమయంలో పదోన్నతులు పొందలేకపోతున్నామని ఉద్యోగులు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా… ఆయన సానుకూలంగా స్పందించారు. నెగిటివ్ మార్కుల విధానాన్ని రద్దు చేయాల్సిందిగా ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు వివిధ శాఖల్లో పనిచేసే లక్షలమంది ఉద్యోగులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది.

అటు ప్రొబేషనరీ సమయంలో ఉన్న మహిళా ఉద్యోగులు కూడా మెటర్నిటీ సెలవులు పొందే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రొబేషనరీలో ఉన్నందున వారిలో అవసరమైన మహిళలు ఈ సెలవులు వాడుకోవచ్చు. అవసరమైన మహిళలు 180 రోజుల మెటర్నిటీ సెలవులను వినియోగించుకోవచ్చు. ప్రొబేషనరీలో ఉన్నమహిళా ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్ సదుపాయం కలిగించినందుకు గాను సీఎంకు ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.

First Published:  25 Sep 2020 10:38 PM GMT
Next Story