మరో సినిమా పని స్టార్ట్ చేసిన చిరు

ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఆయన తెరవెనక మరో సినిమా కూడా చేస్తున్నారు. అదే వేదాళం రీమేక్. అవును.. మెహర్ రమేష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పనులు తెరవెనక శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమా కోసం మణిశర్మ కొడుకు మహతి స్వరసాగర్ ను మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకునే ఉద్దేశంలో ఉన్నారు. రీసెంట్ గా మహతి అందించిన 2 ట్యూన్స్ ను చిరంజీవి విన్నారు.

మరోవైపు కేజీఎఫ్ లాంటి ప్రాజెక్టుకు వర్క్ చేసిన అంబు-అరివు ను ఈ సినిమాకు ఫైట్ మాస్టర్లుగా తీసుకోబోతున్నారు. రీసెంట్ గా వీళ్లతో చిరంజీవి భేటీ అయ్యారు కూడా. మరోవైపు ఇదే సినిమా కోసం గుండు లుక్ కూడా ట్రై చేశారు చిరంజీవి.

వీటితో పాటు.. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్ర కోసం సాయిపల్లవితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే ఆమెకు స్టోరీ మొత్తం చెప్పారు. త్వరలోనే చిరంజీవి స్వయంగా సాయిపల్లవికి ఫోన్ చేస్తారని టాక్. ఇలా వేదాళం రీమేక్ కు సంబంధించి చాలా వర్క్ నడుస్తోంది. కానీ ఏదీ అఫీషియల్ గా బయటకు చెప్పడం లేదు. ఆచార్య షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాతే అన్ని విషయాలు అఫీషియల్ గా బయటకొస్తాయి.