Telugu Global
Health & Life Style

ఫోన్ ద్వారా లాలాజల పరీక్ష... 73 లక్షల బహుమతి !

ఫోన్ ద్వారా లాలాజల పరీక్ష చేసే టెక్నాలజీని కనిపెట్టింది ఓ భారతీయ అమెరికా సంస్థ. మొబైల్ ఫోన్ ద్వారా ఇన్ ఫెక్షన్, వాపుకి సంబంధించిన వ్యాధులు, పోషకాహారా లోపాలు వంటివాటిని కనిపెట్టే ఈ విధానం… అమెరికాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిర్వహించిన ‘టెక్నాలజీ యాక్సిలరేటర్ ఛాలెంజ్ ప్రైజ్’ అనే బహుమతిని గెలుచుకుంది. ఫోన్ ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించగల ఈ వినూత్న విధానాన్ని  కార్నెల్ రీసెర్చర్స్ టీమ్ అనే శాస్త్రవేత్తల బృందం కనుగొంది. దీనికి […]

ఫోన్ ద్వారా లాలాజల పరీక్ష... 73 లక్షల బహుమతి !
X

ఫోన్ ద్వారా లాలాజల పరీక్ష చేసే టెక్నాలజీని కనిపెట్టింది ఓ భారతీయ అమెరికా సంస్థ. మొబైల్ ఫోన్ ద్వారా ఇన్ ఫెక్షన్, వాపుకి సంబంధించిన వ్యాధులు, పోషకాహారా లోపాలు వంటివాటిని కనిపెట్టే ఈ విధానం… అమెరికాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిర్వహించిన ‘టెక్నాలజీ యాక్సిలరేటర్ ఛాలెంజ్ ప్రైజ్’ అనే బహుమతిని గెలుచుకుంది.

ఫోన్ ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించగల ఈ వినూత్న విధానాన్ని కార్నెల్ రీసెర్చర్స్ టీమ్ అనే శాస్త్రవేత్తల బృందం కనుగొంది. దీనికి సౌరభ్ మెహతా నాయకత్వం వహించారు. ‘టెక్నాలజీ యాక్సిలరేటర్ ఛాలెంజ్ ప్రైజ్’ పోటీల్లో గెలిచినందుకు బహుమతిగా వీరికి ఒక లక్ష అమెరికన్ డాలర్లు ( రూ. 73,69,490) లభించాయి. ప్రపంచ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి మందులు, వైద్య పరికరాలు అవసరం లేకుండా వైద్య పరీక్షలు నిర్వహించగల కొత్త టెక్నాలజీని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ పోటీలను నిర్వహించింది.

ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారినైనా ఈ విధానంలో చాలా వేగంగా పరీక్షించవచ్చని, దీని ఫలితాలు చాలా కచ్ఛితంగా ఉంటాయని, ప్రపంచవ్యాప్తంగా… వైద్య సదుపాయాలు సరిగ్గా అందుబాటులో లేని ప్రజలకు ఈ విధానం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని మెహతా అన్నారు.

ఫోన్ ద్వారా లాలాజలం పరీక్షించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించే ఈ వినూత్న విధానంలో… త్రీ డి ప్రింటెడ్ అడాప్టర్… మొబైల్ యాప్ తో అనుసంధానమై పనిచేస్తుంది. ఈ మొబైల్ యాప్… ఫోన్ కెమెరా ద్వారా తీసే ఫొటో ఆధారంగా వైద్యులు… మలేరియా, ఐరన్ లోపం, వాపు, మంట లక్షణాలతో కూడిన అనారోగ్యాలు మొదలైన ఆరోగ్య సమస్యలను నిర్దారించే అవకాశం ఉంది. ఈ పరీక్షకు పావుగంట మాత్రమే సమయం పడుతుంది.

ఫోన్ ద్వారా లాలాజల పరీక్ష చేసే టెక్నాలజీని కనుగొన్న శాస్త్రవేత్తలకు సారధ్యం వహించిన మెహతా… భారతీయ సంతతికి చెందిన అమెరికన్. ఈయన గ్లోబల్ హెల్త్, అంటువ్యాధులు, పోషకాహార విభాగాల్లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

First Published:  26 Sep 2020 9:37 PM GMT
Next Story