కీర్తిసురేష్ కూడా వచ్చేసింది

సినిమాలన్నీ సెట్స్ పైకి వచ్చేస్తున్నాయి. హీరోలంతా ఒక్కొక్కరుగా సెట్స్ పైకి వస్తున్నారు. వీళ్లతో సమానంగా హీరోయిన్లు కూడా ఒక్కొక్కరే షూటింగ్స్ కు హాజరవుతున్నారు. ఇప్పటికే రకుల్, నభా నటేష్ లాంటి హీరోయిన్లు రాగా.. ఇప్పుడు కీర్తిసురేష్ కూడా సెట్స్ పైకి రావడానికి రెడీ అయింది.

నితిన్ సరసన రంగ్ దే అనే సినిమా చేస్తోంది కీర్తిసురేష్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు సెట్స్ పైకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు చెన్నై నుంచి హైదరాబాద్ వాలిపోయింది ఈ ముద్దుగుమ్మ. సోమవారం నుంచి రంగ్ దే షెడ్యూల్ లో జాయిన్ అవుతుంది.

ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబుతో కలిసి అమెరికా వెళ్లబోతోంది కీర్తిసురేష్. పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట ఫస్ట్ షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. నవంబర్ నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతుందని టాక్. ప్రస్తుతం వీసా పనులు నడుస్తున్నాయి.