ఎట్టకేలకు చరణ్ అంగీకరించాడు

ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా ఏంటి? దీనిపై మొన్నటివరకు చాలా సస్పెన్స్ నడిచింది. వెంకీ కుడుముల, అనీల్ రావిపూడి, గౌతమ్ తిన్ననూరి, వంశీ పైడిపల్లి, ప్రశాంత్ నీల్.. ఇలా చాలా పేర్లు తెరపైకొచ్చాయి. ఫైనల్ గా తన నెక్ట్స్ సినిమాను రామ్ చరణ్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు. ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది ఈ సినిమా. అయితే మూవీకి సంబంధించి చరణ్ కంప్లీట్ నెరేషన్ ఇంకా వినలేదు. బౌండెడ్ స్క్రిప్ట్ తీసుకురావాల్సిందిగా వంశీ పైడిపల్లికి సూచించాడు.

ఫుల్ నెరేషన్ విన్న తర్వాత ఈ ప్రాజెక్టుపై చరణ్ ఓ ఐడియాకు వస్తాడు. అయితే హీరోల్ని ఒప్పించడంలో వంశీ పైడిపల్లి దిట్ట. మహేష్ లాంటి హీరోనే ఆయన మెస్మరైజ్ చేశాడు. కాబట్టి ఆల్రెడీ వర్క్ చేసిన చరణ్ ను తన స్క్రిప్ట్ తో ఒప్పించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. సో.. ఈ ప్రాజెక్టు ఆల్ మోస్ట్ ఫిక్స్.