మరో సినిమాకు ఓకే చెప్పిన పవన్

వరుస సినిమాలతో ఊపుమీదున్న పవన్ కల్యాణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈసారి దర్శకుడ్ని ఆయన ఓకే చేయలేదు. ముందుగా నిర్మాతను ఫిక్స్ చేశారు. త్వరలోనే దర్శకుడు ఎవరనేది లాక్ చేస్తారు. ఇంతకీ ఆ నిర్మాత ఎవరో తెలుసా..? బండ్ల గణేశ్.

పవన్ ను తన దేవుడిగా ఎప్పటికప్పుడు చెప్పుకుంటాడు బండ్ల. అదే టైమ్ లో పవన్ కు తనకు పడనట్టు కూడా వ్యవహరిస్తుంటాడు. ఏదైతేనేం మొత్తానికి పవన్ తో మరో సినిమాకు కమిట్ మెంట్ తీసుకున్నాడు బండ్ల. ఈ మేరకు పవన్ తో ఓ సెల్ఫీ కూడా దిగి ఆ ఫొటో పోస్ట్ చేశాడు.

పవన్ నటించిన తీన్ మార్ సినిమాకు బండ్ల గణేశ్ నిర్మాత. అది పెద్ద ఫ్లాప్ అయింది. దీంతో గబ్బర్ సింగ్ సినిమాను నిర్మించే అవకాశం ఇచ్చాడు పవన్. అది బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఆ రెండు సినిమాల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు పవన్-బండ్ల కలిసి మరో సినిమా చేయబోతున్నారు. దర్శకుడు ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడించబోతున్నాడు బండ్ల గణేశ్.