Telugu Global
CRIME

సస్పెన్షన్‌ జడ్జి సోదరుడిపై దాడి టీడీపీ నేత పనే

ఆదివారం చిత్తూరు జిల్లా బి. కొత్తపేటలో రామచంద్ర అనే వ్యక్తిపై కొందరు దాడి చేశారు. ఈ రామచంద్ర సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ సోదరుడు. రామకృష్ణ సోదరుడిపై దాడి జరగగానే చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు అప్పటికప్పుడు డీజీపీకి లేఖ రాసేశారు. రామచంద్రపై దాడి వెనుక వైసీపీ ఉందని ఆ లేఖలో ఆరోపించారు. నిందితులను 24 గంటల్లోగా అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళావెంకట్రావ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై రంగంలోకి […]

సస్పెన్షన్‌ జడ్జి సోదరుడిపై దాడి టీడీపీ నేత పనే
X

ఆదివారం చిత్తూరు జిల్లా బి. కొత్తపేటలో రామచంద్ర అనే వ్యక్తిపై కొందరు దాడి చేశారు. ఈ రామచంద్ర సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ సోదరుడు. రామకృష్ణ సోదరుడిపై దాడి జరగగానే చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు అప్పటికప్పుడు డీజీపీకి లేఖ రాసేశారు. రామచంద్రపై దాడి వెనుక వైసీపీ ఉందని ఆ లేఖలో ఆరోపించారు.

నిందితులను 24 గంటల్లోగా అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళావెంకట్రావ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయాలను బయటపెట్టారు. ఈ దాడి చేసింది టీడీపీ నాయకుడేనని దర్యాప్తులో తేలింది.

టీడీపీ నాయకుడు ప్రతాప్ తన కారులో వెళ్తున్న సమయంలో ఒక ఇరుకు గల్లీలో తోపుడు బండి ఉండడం చూసి కారుకు దారి ఇవ్వాలని కోరాడు. అందుకు తోపుడి బండి అతడు సానుకూలంగా స్పందించలేదు. దాంతో కారు దిగిన ప్రతాప్‌… తోపుడు బండి వ్యక్తితో వాగ్వాదానికి దిగగా అక్కడే ఉన్న ఈ రామచంద్ర జోక్యం చేసుకున్నాడు. దాంతో ప్రతాప్‌తో పాటు కారులో ఉన్న మరో ముగ్గురు కలిసి రామచంద్రను కొట్టారు.

దాడి చేసిన ప్రతాప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు రామచంద్ర అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని, వాగ్వాదానికి దిగడంతో ఆ సమయంలో గొడవ జరిగిందని పోలీసులకు వివరించాడు. దాంతో చంద్రబాబునాయుడు చేసిన ప్రచారం తుస్సుమంది.

First Published:  28 Sep 2020 9:33 AM GMT
Next Story