Telugu Global
International

మాకొద్దు వ్యాక్సిన్... అమెరికాలో యాభైశాతం మంది విముఖత !

కరోనా నుండి తప్పించుకోవడానికి ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూపులు చూస్తున్న కాలమిది. ఇలాగే అనుకుంటున్నాం కదా… కానీ అమెరికాలో సగం జనాభా కోవిడ్ కి వ్యాక్సిన్ వచ్చినా మేము తీసుకోము… మాకొద్దు అంటున్నారు. ప్యూ రీసెర్చి సెంటర్ నిర్వహించిన సర్వేలో ఇదే తేలింది. సెప్టెంబరు 8 నుండి 13 వరకు పదివేలమంది అమెరికన్లను సర్వే కోసం ప్రశ్నించగా కేవలం యాభై ఒక్క శాతం మంది మాత్రమే… వ్యాక్సిన్ తీసుకునేందుకు సుముఖత చూపించారు. అంటే దాదాపు సగం మందికి కరోనా […]

మాకొద్దు వ్యాక్సిన్... అమెరికాలో యాభైశాతం మంది విముఖత !
X

కరోనా నుండి తప్పించుకోవడానికి ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూపులు చూస్తున్న కాలమిది. ఇలాగే అనుకుంటున్నాం కదా… కానీ అమెరికాలో సగం జనాభా కోవిడ్ కి వ్యాక్సిన్ వచ్చినా మేము తీసుకోము… మాకొద్దు అంటున్నారు. ప్యూ రీసెర్చి సెంటర్ నిర్వహించిన సర్వేలో ఇదే తేలింది.

సెప్టెంబరు 8 నుండి 13 వరకు పదివేలమంది అమెరికన్లను సర్వే కోసం ప్రశ్నించగా కేవలం యాభై ఒక్క శాతం మంది మాత్రమే… వ్యాక్సిన్ తీసుకునేందుకు సుముఖత చూపించారు. అంటే దాదాపు సగం మందికి కరోనా వ్యాక్సిన్ తీసుకోవటం ఇష్టం లేదు.

మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఇదే సర్వేని మేలో నిర్వహించినప్పుడు 72శాతం మంది వ్యాక్సిన్ తమకు ఇష్టమేనని చెప్పారు. ఆ సంఖ్య ఇప్పుడు 51 శాతానికి పడిపోయింది. ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే… తప్పకుండా తీసుకుంటామని 21 శాతం మంది మాత్రమే చెప్పారు.

వ్యాక్సిన్ ని చాలా వేగంగా తయారుచేస్తున్నారని, దాంతో… దాని తయారీలో లోపాలు ఉండవచ్చనే భయాలు చాలామందిలో ఉన్నాయి. వ్యాక్సిన్ తయారీ వెనుక సైన్స్ కంటే ఎక్కువగా రాజకీయాలు ప్రముఖ పాత్రని పోషిస్తున్నాయనే అభిప్రాయాలు సైతం ప్రజల్లో ఉన్నాయి. ఆ ప్రభావం వల్లనే దానిని తీసుకోవటం విషయంలో సంశయం వ్యక్తమవుతోందని భావిస్తున్నారు.

ఈ విషయం అర్థం కావటం వల్లనే కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో ఉన్న తొమ్మిది ఔషధ కంపెనీలు… తాము పూర్తిగా శాస్త్రీయ విధానాలను అనుసరిస్తున్నామంటూ ఈ నెల మొదట్లో ప్రకటించాయి. ఆస్ట్రా జెనెకా, ఫైజర్, మొడెర్నా… కంపెనీలు సైతం గతవారం తమ క్లినికల్ ట్రైల్స్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడించాయి. వ్యాక్సిన్ ని త్వరగా తీసుకురావటంతో పాటు… దానిపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యతసైతం దాని తయారీదారులపైన, ప్రభుత్వాలపైన ఉందని దీనిని బట్టి తెలుస్తోంది.

First Published:  28 Sep 2020 2:24 AM GMT
Next Story