Telugu Global
National

ఏపీలో కళ తప్పిన కార్పొరేట్ స్కూల్స్...

ఏపీలో గతేడాది వరకు కార్పొరేట్ స్కూల్స్ దే హవా. పట్టణాల నుంచి మండల కేంద్రాలకు, మారుమూల గ్రామాల్లో కూడా కార్పొరేట్ స్కూల్స్ బ్రాంచ్ లు ఏర్పాటయ్యాయి. చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ స్థానాన్ని పూర్తిగా ఆక్రమించేసి, కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించాయి. అయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు కార్పొరేట్ సెక్టార్ విలవిల్లాడిపోతోంది. కరోనా దెబ్బ ఓవైపు, ప్రభుత్వ స్కూళ్లలో మెరుగవుతున్న సౌకర్యాలు మరోవైపు.. గ్రామాల్లో తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పులు తీసుకొచ్చాయి. ఈ ఏడాది ప్రైవేట్ […]

ఏపీలో కళ తప్పిన కార్పొరేట్ స్కూల్స్...
X

ఏపీలో గతేడాది వరకు కార్పొరేట్ స్కూల్స్ దే హవా. పట్టణాల నుంచి మండల కేంద్రాలకు, మారుమూల గ్రామాల్లో కూడా కార్పొరేట్ స్కూల్స్ బ్రాంచ్ లు ఏర్పాటయ్యాయి. చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ స్థానాన్ని పూర్తిగా ఆక్రమించేసి, కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించాయి.

అయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు కార్పొరేట్ సెక్టార్ విలవిల్లాడిపోతోంది. కరోనా దెబ్బ ఓవైపు, ప్రభుత్వ స్కూళ్లలో మెరుగవుతున్న సౌకర్యాలు మరోవైపు.. గ్రామాల్లో తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పులు తీసుకొచ్చాయి.

ఈ ఏడాది ప్రైవేట్ స్కూల్స్ వదిలి సుమారు 2లక్షల 50వేలమంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చేరతారని అంచనా. 2నెలల వ్యవధిలోనే 70వేలమందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ సెక్టార్ నుంచి బైటకొచ్చి ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు తీసుకున్నారు.

9, 10 తరగతులవారికి ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో క్లాసులు కూడా మొదలయ్యాయి. దీంతో కొత్త అడ్మిషన్లు జోరందుకున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఇంగ్లిష్ మీడియం ప్రారంభం అవుతుందన్న వార్తల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు సర్కారు బడులపై ఆసక్తి పెంచుకుంటున్నారు.

మరోవైపు నాడు-నేడు పనుల ద్వారా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. పెయింటింగ్స్, ఫర్నిచర్, లైట్లు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, మంచినీటి వసతి.. అన్నిట్లో ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా తయారవుతున్నాయి సర్కారు బడులు.

కరోనా సెలవల వల్ల నాడు-నేడు పనులు దాదాపుగా పూర్తి కావడం మరో మంచి పరిణామం. ఇక జగనన్న విద్యా కానుక ద్వారా యూనిఫామ్, షూస్, సాక్స్, బుక్స్, బెల్ట్, బ్యాగ్.. కూడా ఉచితంగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు అందిస్తున్నారు. దీనికోసం ఏకంగా 650కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం.

జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందుబాటులోకి వచ్చింది. అంగన్వాడీ స్కూళ్లను ప్రీ ప్రైమరీగా మార్చడంతో.. ఎల్కేజీ, యూకేజీ పిల్లలను కూడా ప్రభుత్వ స్కూళ్లకే పంపిిస్తున్నారు. విద్యకోసం ఇంత ఖర్చు పెడుతున్న ప్రభుత్వం రాబోయే రోజుల్లో అమ్మఒడి డబ్బుల్ని పూర్తిగా ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకే వర్తింపజేసే ఆలోచనలో ఉందని కూడా తెలుస్తోంది.

పిల్లలకు బట్టలు, బుక్స్ ఇచ్చి, ఉచితంగా చదువు చెప్పి, అన్నం పెట్టి… ఎదురు డబ్బులిచ్చి.. ప్రోత్సహిస్తోంది కాబట్టే.. ఏపీలో ప్రభుత్వ స్కూళ్లకు ఆదరణ పెరుగుతోంది, కార్పొరేట్ సెక్టార్ పై చావుదెబ్బ పడింది. కార్పొరేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీని తట్టుకోలేని మధ్యతరగతివారంతా ఈపాటికే ప్రభుత్వ పాఠశాలలవైపు చూస్తున్నారు.

ఇక ఉన్నతాదాయ వర్గాల్లో కూడా ఆలోచన మొదలైతే.. గ్రామాలనుంచి కార్పొరేట్ స్కూళ్లు తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే. విద్యను వ్యాపారంగా భావించి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న వారంతా వెనక్కు తగ్గాల్సిందే.

First Published:  28 Sep 2020 2:26 AM GMT
Next Story