రామ్ ఆ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడా?

ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకోవడం రామ్ స్టయిల్. ఈ గ్యాప్ లో తను విన్న కథల్ని ఓసారి గుర్తుచేసుకుంటాడు. ఏ స్టోరీ అయితే బాగుంటుందా అని సుదీర్ఘంగా ఆలోచిస్తాడు. ఫైనల్ గా ఆ దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడు. సినిమా సెట్స్ పై ఉంటుండగా మరో మూవీ గురించి ఆలోచించడం ఈ హీరోకు ఇష్టం ఉండదు. అందుకే కెరీర్ లో చాలా గ్యాప్స్.

తాజాగా ఈ హీరో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆల్రెడీ చేతిలో ఉన్న 3 స్టోరీలపై బాగా ఆలోచించి, ఫైనల్ గా వివేక్ ఆత్రేయకు అవకాశం ఇచ్చాడు. ఓ మంచి ట్విస్ట్ ఉండే ప్రేమకథతో వివేక్ ఆత్రేయ, రామ్ ను మెప్పించినట్టు తెలుస్తోంది.

లెక్కప్రకారం నాని హీరోగా వివేక్ ఆత్రేయ సినిమా చేయాలి. కానీ టక్ జగదీశ్, శ్యామ్ సింగరాయ్ సినిమాలు లేట్ అవ్వడంతో ఇతడి సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. సో.. నాని ఆ రెండు సినిమాలు పూర్తి చేసేలోపు రామ్ తో వివేక్ ఆత్రేయ ఓ సినిమా చేస్తాడన్నమాట.