Telugu Global
National

పత్రికల క్లిప్పింగ్‌ లతో పిటిషన్లు వేసి పిల్ అంటున్నారు " ఏపీ హైకోర్టు

హైకోర్టులో వరుసగా దాఖలవుతున్న ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. పత్రికల్లో వచ్చే కథనాల క్లిప్పింగ్‌లను జత చేసి వాటి ఆధారంగానే పిటిషన్లు వేస్తూ వాటినే ప్రజాప్రయోజన వ్యాజ్యాలంటున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. పిల్ వేసిన మరుసటి రోజు ఆ విషయాన్ని పత్రికల్లో పెద్దవిగా రాయించుకుంటున్నారని హైకోర్టు అభ్యంతరం తెలిపింది. హైకోర్టు ఉన్నది ఇలాంటి వ్యాజ్యాలను విచారించడానికి కాదు అని తేల్చిచెప్పింది. గండికోట రిజర్వాయర్‌ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు […]

పత్రికల క్లిప్పింగ్‌ లతో పిటిషన్లు వేసి పిల్ అంటున్నారు  ఏపీ హైకోర్టు
X

హైకోర్టులో వరుసగా దాఖలవుతున్న ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. పత్రికల్లో వచ్చే కథనాల క్లిప్పింగ్‌లను జత చేసి వాటి ఆధారంగానే పిటిషన్లు వేస్తూ వాటినే ప్రజాప్రయోజన వ్యాజ్యాలంటున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.

పిల్ వేసిన మరుసటి రోజు ఆ విషయాన్ని పత్రికల్లో పెద్దవిగా రాయించుకుంటున్నారని హైకోర్టు అభ్యంతరం తెలిపింది. హైకోర్టు ఉన్నది ఇలాంటి వ్యాజ్యాలను విచారించడానికి కాదు అని తేల్చిచెప్పింది.

గండికోట రిజర్వాయర్‌ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 2011లోనే పరిహారం చెల్లించామని ప్రభుత్వం చెబుతోందని… ఒకసారి పరిహారం తీసుకున్న తర్వాత నిర్వాసితులు అక్కడి నుంచి ఖాళీ చేయాల్సిందేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. పరిహారం తీసుకుని కూడా గ్రామాలను ఖాళీ చేయబోమంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని న్యాయస్థానం ప్రశ్నించింది.

మీడియానే వీటిని నిర్ణయిస్తుందనకుంటే మీడియా వద్దకు వెళ్లాలని… ఇలా హైకోర్టును ఆశ్రయించడం ఎందుకని ప్రశ్నించింది. దాంతో పిటిషనర్ తరపున న్యాయవాది మౌనంగా ఉండిపోయారు.

First Published:  29 Sep 2020 6:41 AM GMT
Next Story