Telugu Global
National

హైకోర్టులో అశ్వనీదత్ పిటిషన్

గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద భూములు ఇచ్చి అందుకు ప్రతిఫలంగా అమరావతిలో భూములు దక్కించుకున్న నిర్మాత అశ్వనీదత్ హైకోర్టును ఆశ్రయించారు. అమరావతిలో భూముల విలువ పడిపోయినందున… గన్నవరం ఎయిర్‌పోర్టుకు తానిచ్చిన భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని గానీ, ఎయిర్‌పోర్టు అథారిటీని గాని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఎయిర్‌పోర్టు వద్ద తాను ఇచ్చిన 39 ఎకరాల భూమి విలువ ఎకరాకు కోటి 54 లక్షల వరకు ఉందని వివరించారు. ఆ భూమికి సమానమైన విలువ […]

హైకోర్టులో అశ్వనీదత్ పిటిషన్
X

గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద భూములు ఇచ్చి అందుకు ప్రతిఫలంగా అమరావతిలో భూములు దక్కించుకున్న నిర్మాత అశ్వనీదత్ హైకోర్టును ఆశ్రయించారు. అమరావతిలో భూముల విలువ పడిపోయినందున… గన్నవరం ఎయిర్‌పోర్టుకు తానిచ్చిన భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని గానీ, ఎయిర్‌పోర్టు అథారిటీని గాని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.

ఎయిర్‌పోర్టు వద్ద తాను ఇచ్చిన 39 ఎకరాల భూమి విలువ ఎకరాకు కోటి 54 లక్షల వరకు ఉందని వివరించారు. ఆ భూమికి సమానమైన విలువ కలిగిన భూమిని రాజధాని అమరావతిలో ఇస్తామని సీఆర్‌డీఏ ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. ఇప్పుడు రాజధానిని తరలిస్తున్నారు కాబట్టి అమరావతిలో భూమి విలువ 30 లక్షలకు మించి లేదని అశ్వనీదత్ చెబుతున్నారు.

కాబట్టి తన 39 ఎకరాలకు భూసేకరణ చట్టం ప్రకారం భూమి విలువకు నాలుగు రెట్లు అంటే 210 కోట్లు చెల్లించేలా ప్రభుత్వాన్ని, ఎయిర్‌పోర్టు అథారిటీని ఆదేశించాలని కోరారు.

First Published:  28 Sep 2020 8:54 PM GMT
Next Story