Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ కు భాగమతి

తెలుగులో అనుష్క హీరోయిన్ గా నటించిన భాగమతి సినిమా బాలీవుడ్ కు వెళ్లబోతోందనే విషయం పాతదే. దీనిపై ఇప్పటికే అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడీ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు బయటకొచ్చాయి. భాగమతి సినిమాను హిందీలో దుర్గావతి పేరిట రీమేక్ చేయబోతున్నారు. తెలుగు వెర్షన్ ను డైరక్ట్ చేసిన అశోక్.. హిందీ రీమేక్ కు కూడా దర్శకత్వం వహించబోతున్నాడు. తెలుగులో అనుష్క పోషించిన పాత్రను హిందీలో భూమి ఫడ్నేకర్ పోషించబోతోంది. అక్టోబర్ చివరి వారం లేదా […]

బాలీవుడ్ కు భాగమతి
X

తెలుగులో అనుష్క హీరోయిన్ గా నటించిన భాగమతి సినిమా బాలీవుడ్ కు వెళ్లబోతోందనే విషయం పాతదే. దీనిపై ఇప్పటికే అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడీ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు బయటకొచ్చాయి.

భాగమతి సినిమాను హిందీలో దుర్గావతి పేరిట రీమేక్ చేయబోతున్నారు. తెలుగు వెర్షన్ ను డైరక్ట్ చేసిన అశోక్.. హిందీ రీమేక్ కు కూడా దర్శకత్వం వహించబోతున్నాడు. తెలుగులో అనుష్క పోషించిన పాత్రను హిందీలో భూమి ఫడ్నేకర్ పోషించబోతోంది.

అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. మూవీ సెట్స్ పైకి వెళ్లకముందే డీల్ క్లోజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకుంది. అంటే.. ఈ మూవీ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుందన్నమాట.

First Published:  29 Sep 2020 3:00 AM GMT
Next Story