Telugu Global
National

చంద్రబాబుకు డీజీపీ కౌంటర్‌ లెటర్‌

చిత్తూరు జిల్లాలో సస్పెన్షన్‌కు గురైన జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన దాడి విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాసిన లేఖకు డీజీపీ సమాధానంగా ప్రతి లేఖ రాశారు. చంద్రబాబు చేసిన ఆరోపణలు అవాస్తవమని వివరిస్తూ వాస్తవాలను లేఖలో వెల్లడించారు. రామచంద్రపై దాడి కేసు దర్యాప్తు వేగంగా సాగుతోందని వివరించారు. దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. కారులో వెళ్తున్న ప్రతాప్‌ రెడ్డికి, రామచంద్రకు మధ్య తోపుడు బండి వద్ద గొడవ జరిగిందని డీజీపీ వివరించారు. […]

చంద్రబాబుకు డీజీపీ కౌంటర్‌ లెటర్‌
X

చిత్తూరు జిల్లాలో సస్పెన్షన్‌కు గురైన జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన దాడి విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాసిన లేఖకు డీజీపీ సమాధానంగా ప్రతి లేఖ రాశారు. చంద్రబాబు చేసిన ఆరోపణలు అవాస్తవమని వివరిస్తూ వాస్తవాలను లేఖలో వెల్లడించారు.

రామచంద్రపై దాడి కేసు దర్యాప్తు వేగంగా సాగుతోందని వివరించారు. దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. కారులో వెళ్తున్న ప్రతాప్‌ రెడ్డికి, రామచంద్రకు మధ్య తోపుడు బండి వద్ద గొడవ జరిగిందని డీజీపీ వివరించారు. గొడవ జరిగిన సమయంలో రామచంద్ర మద్యం మత్తులో ఉన్నట్టు వైద్యులు నిర్దారించారని డీజీపీ స్పష్టం చేశారు. దాడి చేసిన ప్రతాప్‌ రెడ్డి టీడీపీ కార్యకర్త అని వివరించారు.

వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదని చంద్రబాబుకు సూచించారు. ఏవైనా ఆధారాలుంటే ఇవ్వాలని వాటి ఆధారంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారు.

First Published:  29 Sep 2020 12:20 AM GMT
Next Story