Telugu Global
Cinema & Entertainment

మహేష్ మూవీ షూటింగ్ వివరాలు

మహేష్ బాబు కొత్త సినిమా సర్కారువారి పాట. పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఈ మేరకు వీసా ప్రాసెస్ జరుగుతుండగా, మరోవైపు దర్శకుడు పరశురామ్ తన సినిమాకు సంబంధించి లొకేషన్లు ఫిక్స్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. సర్కారువారి పాట సినిమా కోసం వాషింగ్టన్, ఫ్లోరిడాలో షూటింగ్ చేయాలని నిర్ణయించారు. ముందుగా డెట్రాయిట్ అనుకున్నప్పటికీ.. వాషింగ్టన్, ఫ్లోరిడా అయితే మరింత […]

మహేష్ మూవీ షూటింగ్ వివరాలు
X

మహేష్ బాబు కొత్త సినిమా సర్కారువారి పాట. పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఈ మేరకు వీసా ప్రాసెస్ జరుగుతుండగా, మరోవైపు దర్శకుడు పరశురామ్ తన సినిమాకు సంబంధించి లొకేషన్లు ఫిక్స్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. సర్కారువారి పాట సినిమా కోసం వాషింగ్టన్, ఫ్లోరిడాలో షూటింగ్ చేయాలని నిర్ణయించారు. ముందుగా డెట్రాయిట్ అనుకున్నప్పటికీ.. వాషింగ్టన్, ఫ్లోరిడా అయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

అన్నీ అనుకున్నట్టు జరిగి, వీసాలు సకాలంలో మంజూరైతే.. నవంబర్ 1 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వాషింగ్టన్ లో ప్రారంభం అవుతుంది. నెల రోజుల పాటు ఏకథాటిగా షూటింగ్ నిర్వహించి ఇండియాకు వస్తారు. ఇక మిగతా భాగం మొత్తం ఇండియాలోనే పూర్తిచేస్తారు.

కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ కొన్ని ట్యూన్స్ లాక్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తోంది సర్కారువారి పాట. మహేష్ ఈ సినిమాకు సహ-నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.

First Published:  29 Sep 2020 9:00 AM GMT
Next Story