Telugu Global
Cinema & Entertainment

పూజా హెగ్డేను వదలని త్రివిక్రమ్

మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా హెగ్డే నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అది కూడా ఎన్టీఆర్ సినిమాలో కావడం విశేషం. అవును.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమాలో మరోసారి పూజా హెగ్డేను రిపీట్ చేయాలని అనుకుంటున్నారట. నిజానికి ఈ లిస్ట్ లో పూజా హెగ్డే ను అస్సలు కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే, త్రివిక్రమ్ ఆల్రెడీ పూజా హెగ్డేతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు. అల వైకుంఠపురములో, అరవింద సమేత సినిమాల్లో పూజా హెగ్డేనే […]

పూజా హెగ్డేను వదలని త్రివిక్రమ్
X

మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా హెగ్డే నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అది కూడా ఎన్టీఆర్ సినిమాలో కావడం విశేషం. అవును.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమాలో మరోసారి పూజా హెగ్డేను రిపీట్ చేయాలని అనుకుంటున్నారట.

నిజానికి ఈ లిస్ట్ లో పూజా హెగ్డే ను అస్సలు కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే, త్రివిక్రమ్ ఆల్రెడీ పూజా హెగ్డేతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు. అల వైకుంఠపురములో, అరవింద సమేత సినిమాల్లో పూజా హెగ్డేనే హీరోయిన్. అటు ఎన్టీఆర్ కూడా అరవింద సమేత సినిమాలో పూజాతో నటించాడు. సో.. ఈసారి కొత్తదనం కోసం రష్మికను తీసుకుంటారనే ప్రచారం జరిగింది.

అయితే చుట్టూతిరిగి మరోసారి పూజా హెగ్డేనే తీసుకోవాలని అనుకుంటున్నారట. అయితే దీనిపై ఎన్టీఆర్ ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తారక్ ఓకే అంటేనే పూజా వస్తుంది లేదంటే మరో హీరోయిన్ కు ఆ ఛాన్స్ వెళ్తుంది.

మొత్తానికి అలా అరవింద సమేత యూనిట్ మొత్తం మరోసారి రిపీట్ కాబోతోంది. అదే హీరో, అదే హీరోయిన్, అదే దర్శకుడు, అదే బ్యానర్.. అదన్నమాట సంగతి.

First Published:  29 Sep 2020 10:00 AM GMT
Next Story