ఈసారైనా చరణ్ నుంచి ఆ క్లారిటీ వస్తుందా?

చరణ్ కొత్త సినిమాపై పుకార్లు కొత్త కాదు. అనీల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, గౌతమ్ తిన్ననూరి, సందీప్ రెడ్డి వంగ.. ఇలా చాలామంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే వీటిలో ఏదీ ఇప్పటివరకు కన్ఫర్మ్ కాలేదు. అయితే ఈసారి పుకార్లు మరో అడుగు ముందుకేశాయి. ఏకంగా చరణ్ ఓ సినిమా ఓకే చేసినట్టు గాసిప్స్ వస్తున్నాయి.

వంశీ పైడిపల్లి చెప్పిన కథకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఫుల్ నెరేషన్ తీసుకొని రమ్మన్నాడట. “ఆర్ఆర్ఆర్” తర్వాత ఈ సినిమానే సెట్స్ పైకి వస్తుందట. మరికొంతమంది మరో అడుగు ముందుకేసి ఇదొక స్టయిలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని, జేమ్స్ బాండ్ టైపు స్టోరీ అని కథలు అల్లేస్తున్నారు. ఇలా సాగుతోంది ప్రచారం.

అయితే ఎప్పట్లానే ఈసారి కూడా చరణ్ నుంచి నో క్లారిటీ. ఎన్ని కథలు వింటున్నా, ఎంతమంది దర్శకులు తనను సంప్రదిస్తున్నా, చరణ్ మాత్రం తన అప్ కమింగ్ మూవీపై అప్పుడే నిర్ణయం తీసుకునే ఉద్దేశంలో లేడు. ఒకవేళ నిర్ణయం తీసుకున్నా బయటపెట్టే ఆలోచనలో లేడు. ఎందుకంటే.. అతడి టార్గెట్ అంతా ఇప్పుడు “ఆర్ఆర్ఆర్” మూవీపైనే ఉంది. ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చిన తర్వాత నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన వస్తుంది. అప్పటివరకు ఈ పుకార్లు ఇలా షికార్లు చేస్తూనే ఉంటాయి.