Telugu Global
Cinema & Entertainment

తెరపైకి మరో క్రేజీ కాంబినేషన్

త్వరలోనే వెండితెరపైకి మరో క్రేజీ కాంబినేషన్ రాబోతోంది. వాళ్లే నాని-రష్మిక. వీళ్లిద్దరూ కలిసి ఇప్పటివరకు సినిమా చేయలేదు. అత్యంత సహజంగా నటించే నాని, రష్మికలు కలిస్తే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇప్పుడా సమయం రానే వచ్చింది. అన్నీ అనకున్నట్టు జరిగితే నాని సరన రష్మిక నటించే ఛాన్స్ ఉంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమా చేయబోతున్నాడు నాని. ఇందులో ఓ హీరోయిన్ గా సాయిపల్లవిని ఆల్రెడీ ఫిక్స్ చేశారు. ఇప్పుడు మరో హీరోయిన్ గా […]

తెరపైకి మరో క్రేజీ కాంబినేషన్
X

త్వరలోనే వెండితెరపైకి మరో క్రేజీ కాంబినేషన్ రాబోతోంది. వాళ్లే నాని-రష్మిక. వీళ్లిద్దరూ కలిసి ఇప్పటివరకు సినిమా చేయలేదు. అత్యంత సహజంగా నటించే నాని, రష్మికలు కలిస్తే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇప్పుడా సమయం రానే వచ్చింది. అన్నీ అనకున్నట్టు జరిగితే నాని సరన రష్మిక నటించే ఛాన్స్ ఉంది.

రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమా చేయబోతున్నాడు నాని. ఇందులో ఓ హీరోయిన్ గా సాయిపల్లవిని ఆల్రెడీ ఫిక్స్ చేశారు. ఇప్పుడు మరో హీరోయిన్ గా రష్మికను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అదే కనుక జరిగితే ఈ ప్రాజెక్టు మరింత క్రేజీగా మారిపోతుంది.

అయితే రష్మిక మాత్రం ఇంకా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే.. ఆమె ఇప్పుడు పుష్ప సినిమా కోసం వెయిట్ చేస్తోంది. లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన ఆ సినిమా సెట్స్ పైకి వస్తే తప్ప తన కాల్షీట్ల విషయంలో రష్మికకు ఓ క్లారిటీ రాదు. అందుకే శ్యామ్ సింగరాయ్ పై ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతోంది శ్యామ్ సింగరాయ్.

First Published:  29 Sep 2020 1:00 AM GMT
Next Story