సుకుమార్-విజయ్ కాంబినేషన్

మరో క్రేజీ కాంబినేషన్ తెరపైకొచ్చింది. త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో నటించబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ విషయాన్ని సుకుమార్ స్వయంగా ప్రకటించాడు. కేదార్ అనే కొత్త నిర్మాత ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. నిర్మాత పుట్టిన రోజుని పురస్కరించుకొని ఈ సినిమాను ప్రకటించాడు సుక్కూ.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాను నామ్ కే వాస్తే ప్రకటించలేదు. మూవీకి సంబంధించి హీరో-దర్శకుడి మధ్య స్టోరీ డిస్కషన్లు పూర్తయ్యాయి. పూర్తి స్క్రిప్ట్ కూడా రెడీ అయింది. 2022లో సినిమాను రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. వీళ్లిద్దరూ ఈ సినిమాపై ఎప్పుడు కూర్చున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం బన్నీతో పుష్ప సినిమా చేస్తున్నాడు సుకుమార్. అటు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ రెండు కమిట్ మెంట్స్ పూర్తయిన తర్వాత సుక్కూ-విజయ్ కలుస్తారు.