Telugu Global
CRIME

ఉత్తర ప్రదేశ్ లో ‘ఆమె’ చనిపోయింది !

ఉత్తర ప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న దారుణాలకు అంతే లేకుండా పోతోంది. మహిళలపై అత్యాచారాలు హత్యల ఘటనలు అక్కడ మరింత ఎక్కువగా ఉంటున్నాయి. రెండువారాల క్రితం సామూహిక అత్యాచారానికి, విపరీతమైన హింసకు గురయిన 20 ఏళ్ల యువతి ఈ ఉదయం మరణించింది. హత్ రాస్ అనే గ్రామానికి చెందిన ఈ అమ్మాయి గడ్డి కోసుకునేందుకు వెళ్లగా నలుగురు వ్యక్తులు… ఆమెని పొలాల్లోకి లాక్కుని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఈ నెల 14న జరిగింది. యువతి […]

ఉత్తర ప్రదేశ్ లో ‘ఆమె’ చనిపోయింది !
X

ఉత్తర ప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న దారుణాలకు అంతే లేకుండా పోతోంది. మహిళలపై అత్యాచారాలు హత్యల ఘటనలు అక్కడ మరింత ఎక్కువగా ఉంటున్నాయి. రెండువారాల క్రితం సామూహిక అత్యాచారానికి, విపరీతమైన హింసకు గురయిన 20 ఏళ్ల యువతి ఈ ఉదయం మరణించింది. హత్ రాస్ అనే గ్రామానికి చెందిన ఈ అమ్మాయి గడ్డి కోసుకునేందుకు వెళ్లగా నలుగురు వ్యక్తులు… ఆమెని పొలాల్లోకి లాక్కుని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఈ నెల 14న జరిగింది.

యువతి తన తల్లి, అన్నలతో కలిసి గడ్డి కోసేందుకు వెళ్లింది. అన్న ముందుగా ఇంటికి వచ్చేయటంతో తల్లి, కూతురు పొలాల్లోనే గడ్డికోస్తున్నారు. అయితే తల్లికి ఆమె చాలా దూరంగా ఉండటంతో దుండగులు ఆమె చున్నీనే మెడకు చుట్టి లాక్కుపోయారు. తల్లి… కూతురు కనిపించడం లేదని గమనించి వెతుక్కునే లోపలే దారుణం జరిగింది.

ఆ వ్యక్తులు ఆమెని అత్యంత దారుణంగా హింసించడంతో శరీరంపై పలుచోట్ల తీవ్రమైన గాయాలయ్యాయి. నాలుక తెగిపోయింది. నిన్నటివరకు ఉత్తర ప్రదేశ్ లోని హాస్పటల్ లోనే ఐసియులో చికిత్స పొందిన యువతిని నిన్ననే ఢిల్లీకి తరలించగా ఢిల్లీలోని హాస్పటల్ లో మరణించింది. ఆమె షెడ్యూల్డ్ కులానికి చెందిన యువతి కాగా… ఆ నలుగురు సమాజంలో ఉన్నత కులంగా చెప్పబడుతున్న సామాజిక వర్గానికి చెందినవారుగా తెలుస్తోంది.

ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. యువతిపై జరిగిన హింస, ఆమె గురయిన గాయాలను గురించి తెలిశాక దేశవ్యాప్తంగా ఆందోళనలు వినిపించాయి. ఉత్తర ప్రదేశ్ పోలీసులు తమ బాధని పట్టించుకోలేదని, దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు కనిపించాక… నాలుగయిదు రోజుల తరువాత మాత్రమే స్పందించారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే పోలీసులు… తాము త్వరగానే స్పందించామంటున్నారు. ఆ కుటుంబానికి అవసరమైన సహాయం చేశామన్నారు. ఈ కేసులో విచారణను త్వరగా పూర్తి చేసి నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో శిక్ష పడేలా చేస్తామని హత్ రాస్ పోలీస్ చీఫ్ విక్రాంత్ వీర్ తెలిపారు.

First Published:  29 Sep 2020 5:09 AM GMT
Next Story