Telugu Global
International

గంటకు 90 కోట్ల చొప్పున పెరుగుతున్న ముకేష్‌ అంబానీ సంపద

ప్రపంచాన్ని కరోనా అల్లాడిస్తున్నా, సామాన్యుల జీవితాలు శిథిలం అవుతున్నా దాని ప్రభావం మాత్రం కుబేరులపై పెద్దగా కనిపించడం లేదు. పైగా వారి సంపద అమాంతం పెరుగుతూ పోతోంది. ఈ ఏడాది ముకేష్ అంబానీ సంపద ఏకంగా 73 శాతం పెరిగింది. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్‌2020 ప్రకారం ఆయన సంపద ప్రస్తుతం రూ. 6.58 లక్షల కోట్లు. తొమ్మిదో ఏడాది కూడా దేశంలో అత్యంత ధనికుడిగా ముకేష్ తొలిస్థానంలోనే నిలిచారు. ఆయన సంపద గంటకు 90 కోట్ల […]

గంటకు 90 కోట్ల చొప్పున పెరుగుతున్న ముకేష్‌ అంబానీ సంపద
X

ప్రపంచాన్ని కరోనా అల్లాడిస్తున్నా, సామాన్యుల జీవితాలు శిథిలం అవుతున్నా దాని ప్రభావం మాత్రం కుబేరులపై పెద్దగా కనిపించడం లేదు. పైగా వారి సంపద అమాంతం పెరుగుతూ పోతోంది. ఈ ఏడాది ముకేష్ అంబానీ సంపద ఏకంగా 73 శాతం పెరిగింది. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్‌2020 ప్రకారం ఆయన సంపద ప్రస్తుతం రూ. 6.58 లక్షల కోట్లు.

తొమ్మిదో ఏడాది కూడా దేశంలో అత్యంత ధనికుడిగా ముకేష్ తొలిస్థానంలోనే నిలిచారు. ఆయన సంపద గంటకు 90 కోట్ల మేర పెరుగుతోంది. ప్రపంచంలో ఐదో ధనికుడిగా ముకేష్ అంబానీ ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్న వేళ కుబేరుల సంపద పెరుగుతున్న తీరు చర్చనీయాంశమైంది.

హిందుజా సోదరులు 1.43 లక్షల కోట్లతో దేశంలో రెండోస్థానంలో ఉన్నారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ శివ్‌నాడార్‌, కుటుంబం 1.41 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉంది. అదానీ గ్రూప్ సంపద కూడా ఈ ఏడాది 48 శాతం పెరిగింది. లక్షా 40వేల కోట్ల సంపదతో గౌతం అదానీ దేశంలో నాలుగో సంపన్నుడిగా ఉన్నారు. 1.14 లక్షల కోట్లతో అజీమ్ ప్రేమ్‌జీ ఐదో స్థానంలో ఉన్నారు.

First Published:  29 Sep 2020 10:24 PM GMT
Next Story